అగస్టు, 10వ తేదిన వెల్దండ మండలంలోని ఎన్నం వెంకట రెడ్డి ఫంక్షన్ హాల్లో నిర్వహించనున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ యల్. శర్మన్

త్రికా ప్రకటన
తేది: 7-8-2021
నాగర్ కర్నూల్ జిల్లా
అగస్టు, 10వ తేదిన వెల్దండ మండలంలోని ఎన్నం వెంకట రెడ్డి ఫంక్షన్ హాల్లో నిర్వహించనున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల రెండవ ఫేజ్ అనుమతుల పై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేందుకు పకడ్బంది చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ యల్. శర్మన్ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం జరుగనున్న యెన్నం వెంకట రెడ్డి (AVR) ఫంక్షన్ హాల్ ను కలెక్టర్ ఇరిగేషన్ యస్.ఇ విజయభాస్కర్ రెడ్డి తో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తమ అభిప్రాయాన్ని వ్యక్తపరచేందుకు వచ్చే ప్రజలకు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఏర్పాట్లు చేయాల్సిందిగా సూచించారు. సానిటైజేషన్, తో పాటుగా జ్వరము లాంటి లక్షనాలను గుర్తించేందుకు థర్మ మీటర్లు, పల్స్ ఆక్సి మీటర్లు అందుబాతులు ఉంచాలన్నారు. వచ్చిన వారు తమ ఫోన్ బయటనే పెట్టి వచ్చే విధంగా ఫోన్ డిపాజిట్ కేంద్రం ఏర్పాట్లు చేయాలన్నారు. నాగర్ కర్నూల్, తాడూర్, తిమ్మాజిపేట, బిజినపల్లి, ఉర్కొండ, కల్వకుర్తి, వెల్దండ, వంగూర్ మండలాలలోని ఆయుకట్టు దారులు ఈ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి హాజరవుతారని తెలియజేసారు.
ఇరిగేషన్ యస్.ఇ. విజయ భాస్కర్ రెడ్డి, ఇ.ఇ లు శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్, డి.ఇ దేవన్న, కల్వకుర్తి డి.యస్.పి. గిరిబాబు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.
—————————
జిల్లా పౌర సంబంధాల అధికారి ద్వారా జారి.

Share This Post