అచ్చంపేట లో నిర్మించిన 100 పడకల ఆసుపత్రి అధునాతన సౌకర్యాలతో నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి- తన్నీరు హరీష్ రావు

పత్రిక ప్రకటన
తేది.30-5-2023
నాగర్ కర్నూల్ జిల్లా
అచ్చంపేట లో నిర్మించిన 100 పడకల ఆసుపత్రి అధునాతన సౌకర్యాలతో నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు ఇందులో భాగంగా అచ్చంపేటలో నిర్మించిన వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అచ్చంపేటలో నిర్మించిన వంద పడకల ఆసుపత్రి కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా సకల సౌకర్యాలతో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 100 పడకల ఆసుపత్రి ఐ .సి.యు, డయాలసిస్ సెంటర్, ఎమర్జెన్సీ వార్డు ఏర్పాటు వల్ల ఇప్పుడు 140 పడకల ఆసుపత్రి గా మారిందన్నారు. కాంగ్రెస్ హయాంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ఎక్కడ ఒక డయాలసి సెంటర్ కానీ ఒక ఐసీయూ కేంద్రంగాని నెలకొల్పు లేదన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రతి నియోజకవర్గంలో డయాలసిస్ సెంటర్ ఐసీయూ కేంద్రాలు జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడం జరిగిందన్నారు నాగర్ కర్నూల్ జిల్లాకు నాగర్ కర్నూల్ జిల్లాకు 56 మంది డాక్టర్లను మొన్ననే కేటాయించడం జరిగింది అన్నారు. తెలంగాణ వస్తే ఏమొస్తది అని ప్రశ్నించిన వారికి తెలంగాణ వస్తే ప్రతి ఒక్కరికి ప్రభుత్వ వైద్యం అందుబాటులోకి వస్తుందని నిరూపించిందన్నారు. ఒకప్పుడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే మాట నుండి ఇప్పుడు నేను పోత బిడ్డో సర్కారు దవాఖానకు అనే మాట మాట్లాడుతున్నారు అన్నారు. ఒకప్పుడు ప్రభుత్వ దవాఖానాల్లో 30% ప్రసవాలు జరిగి 70% ప్రసవాలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరిగేవి అన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వ ఆసుపత్రిలో 70 శాతం ప్రసవాలు జరిగితే ప్రైవేట్ ఆసుపత్రిలో 30% ప్రసవాలు మాత్రమే జరుగుతున్నాయని తెలియజేశారు. నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం ఒకప్పుడు తెలంగాణ వైద్య ఆరోగ్య విషయంలో 14వ స్థానంలో ఉంటే ప్రస్తుతం మూడో స్థానంలో కొనసాగుతుందని తెలియజేశారు. ప్రతి నియోజకవర్గంలో ఐసీయూలు, డయాలసిస్ సెంటర్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. రాష్ట్రంలో ఒకప్పుడు 17వేల పడకల ఆసుపత్రులు ఉంటే నేడు యాభై వేల పడకల కు చేరిందన్నారు. బస్తీలో సుస్థి ఏర్పడితే వైద్యం చేసేందుకు 500 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పల్లెల్లో 3000 పల్లె దవాఖానాలు ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. వైద్య శాఖలో పనిచేస్తున్న 1300 మంది కాంటాక్ట్ సిబ్బందికి రెగ్యులర్ చేయడం జరిగిందని, మిగిలిన వారిని త్వరలో రెగ్యులర్ చేయడం జరుగుతుందన్నారు. అచ్చంపేట శాసన సభ్యులు నియోజకవర్గానికి అవసరమని అడిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల పై ప్రత్యేక దృష్టి పెట్టి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి నెరవేర్చే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న అచ్చంపేట శాసనసభ్యులు ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు మాట్లాడుతూ వంద పడకల మతా శిశు సంరక్షణ కేంద్రం అచ్చంపేట కు సైతం మంజురు చేయలని కోరారు. పోస్టుమార్టం, మెకానికల్ లాండ్రీ ఏర్పాటు కు నిధులు మంజూరు చేయాలని, నవజాత శిశు కేంద్రాన్ని 20 పడకల సౌకర్యాలు ఉండేవిధంగా చూడాలని మంత్రిని కోరారు. అచ్చంపేట జాతీయ రహదారిలో ఉన్నందున రోడ్డు ప్రమాదాలు జరిగే వారికి తక్షణ మెరుగైన వైద్యం అందించే విధంగా ఆసుపత్రులను తీర్చిదిద్దాలని మంత్రిని కోరారు.
పార్లమెంట్ సభ్యులు పి రాములు మాట్లాడుతూ ఉస్మానియా ఆస్పత్రిలో ఉన్న సౌకర్యాలు అచ్చంపేట ఆసుపత్రిలో ఉన్నాయని, అధునాతన సౌకర్యాలతో నిర్మించిన వంద పడకల ఆసుపత్రి అచ్చంపేట ప్రజలకు అందుబాటులోకి వచ్చాయనీ తెలియజేశారు. వైద్యులు తమ కర్తవ్యాన్ని పాటించి ప్రజలకు అందుాటులో ఉండాలని కోరారు.
టి.ఎస్.యం.అయి.డి.సి చైర్మన్, ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ అచ్చంపేట నియోజక అభివృద్ధికి శాసన సభ్యులు కృషి చేస్తున్నారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ శాంతకుమారి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్, ఆరోగ్య శాఖ కమిషనర్, మున్సిపల్ చైర్మన్ నర్సింహ గౌడ్, రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ పోకల మనోహర్, జిల్లా వైద్య అధికారి డా. సుధాకర్ లాల్, జడ్పీటీసీ లు, ఎంపిపి లు తదితరులు పాల్గొన్నారు.
————
జిల్లా పౌర సంబంధాల అధికారి, నాగర్ కర్నూల్ ద్వారా జారీ.

Share This Post