పరిశ్రమల ఉత్పత్తులను ఎగుమతి చేయడంపై దృష్టిసారించాలి
జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్
0000
జిల్లాలోని పరిశ్రమల యజమానులు తమ ఉత్పత్తులను ఎగుమతి చేయడంపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అన్నారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కేంద్ర ప్రభుత్వ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్వహిస్తున్న వాణిజ్య ఉత్సవం ఎగుమతుల పై జిల్లా పరిశ్రమల యజమానులతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గ్రానైట్, రైస్ మిల్లులు, మత్స్య పరిశ్రమ, ఫిలిగ్రీ పరిశ్రమలు, వ్యవసాయం, ఉద్యానవన ఉత్పత్తి రంగాలు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. జిల్లాలో రైస్ బ్రాన్ ఆయిల్, విత్తనాలు తదితర పరిశ్రమల ఉత్పత్తులు పెంపొందించాలని, వీటిని ఎగుమతి చేయడానికి తగిన తోడ్పాటు అందిస్తామని తెలిపారు. ఉత్పత్తికి కావలసిన శిక్షణ ఇప్పించడం తోపాటు మార్కెటింగ్ సౌకర్యం తదితరాల వాటిపై సహాయ ,సహకారాలు అందిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ నవీన్ కుమార్, వ్యవసాయాధికారి శ్రీధర్, ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్, అసోసియేషన్ ప్రతినిధులు బచ్చు భాస్కర్, బి ప్రభాకర్ రావు, గ్రానైట్, సిల్వర్ ఫిలిగ్రీ, ఐ టి హార్డ్వేర్ పరిశ్రమల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.