అజాది కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో అక్టోబర్ 1వ తేదీన నెహ్రు యువ కేంద్ర సంఘటన్ ఆధ్వర్యంలో ఫిట్ ఇండియా ఫ్రీడం రన్ నిర్వహించనున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు.

సోమవారం ఆయన తన ఛాంబర్ లో వివిధ శాఖల అధికారులతో ఫిట్ ఇండియా ఫ్రీడం రన్ కార్యక్రమం ఏర్పాట్ల పై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. స్వాతంత్ర్య చరిత్రతో ముడిపడి ఉన్న క్షణాలను గుర్తు చేసుకోవడం దీని ముఖ్య ఉద్దేశ్యమన్నారు. ఫిట్ ఇండియా ఫ్రీడం రన్ లో జిల్లాలోని యువత, యువజన సంఘాల సభ్యులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.

అనంతరం ఫిట్ ఇండియా ఫ్రీడం రన్ టీ షర్ట్స్ ను ఆయన విడుదల చేశారు.

కార్యక్రమంలో జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీపీఓ సురేష్ మోహన్, నెహ్రూ యువ కేంద్ర ఉమ్మడి జిల్లా అధికారిణి బీన్సీ, జిల్లా యువజన అధికారి జావేద్ అలీ, నెహ్రు యువ కేంద్ర కార్యక్రమ అధికారి కిరణ్ కుమార్, జిల్లా వైద్యాధికారిణి గాయత్రీదేవి, ఐకేపీ డీపీఎం కొమురయ్య ఎన్.సీ.సీ ,మరియు ఎన్.ఎస్.ఎస్ అధికారులు మనోజ్, జగదీశ్వర్, నెహ్రు యువ కేంద్ర వాలంటీర్లు అజయ్ యాదవ్, సాయిరాం, అనిల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Share This Post