అజాది కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా నెహ్రూ యువ కేంద్ర – నిజామాబాద్ ఆధ్వర్యంలో వ్యాస రచన, ఉపన్యాస, దేశభక్తి గీతాల, చిత్రలేఖన పోటీలు

స్వతంత్ర భారత అమృతోత్సవాల సందర్భంగా నెహ్రూ యువ కేంద్ర నిర్వహిస్తున్న ఈ పోటీలలో యువతీయువకులు విశేష సంఖ్యలో పాల్గొనాలని ఆహ్వానిస్తున్నాం, ఈ పోటీలలో గెలుపొందిన వారికి నవంబర్ 14వ తేదీ నెహ్రూ యువ కేంద్ర స్థాపనా దినోత్సవ సందర్భంగా బహుమతులు,ప్రశంసా పత్రాలను అందించడం జరుగుతుంది.

పోటీలు – వాటి అంశాలు :-

వ్యాస రచన : – 75 ఏళ్ల స్వాతంత్ర్య భారతం – చరిత్ర – భవిష్యత్ భారతం

చిత్రలేఖనం :- దేశభక్తిని ప్రతిబింబించే చిత్రాలు

పాటల పోటీ :- ఏవైనా దేశభక్తి పాటలు

ఉపన్యాసం :- స్వతంత్ర భారత అమృతోత్సవాల గురించి

పోటీలు జరిగే స్థలం :- నెహ్రూ యువ కేంద్రం ,సుభాష్ నగర్, నిజామాబాద్

అర్హత :- నిజామాబాద్, కామారెడ్డి జిల్లా వాసులు మాత్రమే అయి ఉండాలి, వయసు 30సం రాలు మించకూడదు

తేదీ : 12/11/2021 శుక్రవారం

ఉదయం 11గం లకు వ్యాసరచన, చిత్రలేఖనం

12గం లకు పాటలు,ఉపన్యాస పోటీలు జరుగుతాయి

గమనిక :- చిత్ర లేఖన పోటీలకు చార్ట్ , వ్యాసరచన పోటీలకు కాగితాలు మాత్రమే మేము ఇవ్వడం జరుగుతుంది, ఇతర వస్తువులన్నీ పోటీలో పాల్గొనేవారే తెచ్చుకోవాల్సి ఉంటుంది, పోటీల్లో తెలుగు,హిందీ భాష లకు మాత్రమే అనుమతి ఉంటుంది

ఇతర వివరాలకు : 9717219538 సంప్రదించండి

శైలి బెల్లాల్
జిల్లా యువజన అధికారిణి
నెహ్రూ యువ కేంద్ర
నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాలు

Share This Post