అటల్ టింకరింగ్ ల్యాబ్ నిర్వహణపై జిల్లా కలెక్టర్ సమీక్ష

ప్రచురణార్థం-3
రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 3: సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో విద్యా శాఖకు సంబంధించిన 14 వివిధ పాఠశాలల అటల్ టింకరింగ్ ల్యాబ్ నిర్వహణపై జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ ప్రతి ఒక్క పాఠశాల ప్రధానోపాధ్యాయుని అటల్ టింకరింగ్ ల్యాబ్ నిర్వహణ గురించి తెలుసుకోవడం జరిగింది. అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కేంద్ర ప్రభుత్వ అటల్ టింకరింగ్ గైడ్లైన్స్ ప్రకారం ఈ- మార్కెట్ ఏజెన్సీ ద్వారా మెటీరియల్ ప్రోక్యుర్ చేసామని ప్రధానోపాధ్యాయులు వివరించారు. మంజూరైన 14 అటల్ టింకరింగ్ ల్యాబ్ లో 3 పాఠశాలలకు నిధులు జమ కాలేదని, 11 పాఠశాలల్లో దాదాపుగా నిర్మాణం పూర్తి దశలో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. 4 పాఠశాలల్లో వర్క్స్ షాప్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగిందని ఆయన అన్నారు. అటల్ టింకరింగ్ ల్యాబ్ కు సంబంధించిన గైడ్లైన్స్ పాటించి ల్యాబ్ నిర్వహణ విజయవంతంగా నడిపించి పిల్లలకు అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా విద్యాధికారి డి. రాధాకిషన్, డిఎస్వో వి. ఆంజనేయులు, పాఠశాల ప్రిన్సిపాళ్లు, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post