*అటవి ప్లాంటేషన్ ధ్వంసం చేస్తే కట్టిన చర్యలు తప్పవు. జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య*

ప్రచురణార్థం
ములుగు జిల్లా:
నవంబర్ -08, ( సోమవారం

*అటవి ప్లాంటేషన్ ధ్వంసం చేస్తే కట్టిన చర్యలు తప్పవు. జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య*
అడవులను నరికి వేతకు పాల్పడే వ్యక్తులను ఏ మాత్రం ఉపేక్షించేదు.

*పోడు భూముల సమస్యలపై గ్రామాల వారి గా ధరఖాస్తులు స్వీకరణ *

*పోడు భూముల దరఖాస్తులు ఉచితంగా అందజేస్తున్నాo*

*ప్రజలు ఒక్క రూపాయీ కూడా చెల్లించనవసరం లేదు*

*పోడు భూముల సమస్య పై సలహాలు, పిర్యాదుల కొరకు టోల్ ఫీ.నెంబర్ -1800-425-0520*

అడవిని నాశనం చేయాలనే ఉద్దేశ్యంతో కొత్తగా పోడు కొట్టడానికి ఎవరైనా చూస్తే వారిపై ఇండియన్ ఫారెస్ట్ రైట్ యాక్ట్, ,వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ యాక్ట్, ఐ పి సి సి ఆర్ యాక్ట్ ల ,ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటూ బైండోవర్ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు
ప్రభుత్వం పోడు సాగు దారులకు హక్కు పత్రాలు మంజూరు చేస్తుందనే అదునుగా భావించి కొత్తగా పోడు కొట్టి అడవిని నాశనం చేయాలనే దురుద్దేశం ఎవరికైనా కలిగినట్లైతే విరమించుకోవాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ప్రభుత్వం అటవీ సంపదను కాపాడడానికి అటవీ అధికారులకు పలు సూచనలు సలహాలు చేస్తూన్నప్పటికి, కొత్తగా పోడు కొట్టాలనే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం పై ప్రభుత్వ ఆదేశాల మేరకు  అడవి అధికారులను రంగం లోకి దింపిందని, అడవిని కాపాడడం మనందరి బాధ్యత అని, ప్రభుత్వ ఆదేశాలు విస్మరించిన నట్లు అయితే అటవీ చట్టం కింద కేసులు బుక్ చేసి జైలు కి పంపించడం జరుగుతుందని, ఇట్టి విషయం పై ప్రజలు గమనించగలరని ప్రజలకు కలెక్టర్ విజ్ఞప్తి చేశారు

Share This Post