అటవీ పోడు భూముల పరిరక్షణ సమావేశం : జిల్లా కలెక్టర్ డి హరిచందన ఎం.ఎల్.ఎ. రాజేందర్ రెడ్డి

రాష్ట్రంలో పోడు భూముల సమస్య పరిష్కారానికి రాష్ట్ర  ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా సోమవారం  కలెక్టర్ సమావేశ మందిరం లో  కలెక్టర్ హరిచందన దాసరి అధ్యక్షతన అఖిలపక్ష   సమావేశం నిర్వహించారు.  జిల్లా కలెక్టర్ డి హరిచందన  అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో యస్. రాజేందర్ రెడ్డి నారాయణపేట నియోజకవర్గ  ఎమ్మెల్యే  పాల్గొన్నారు. ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఇచ్చిన నివేదికల ఆధారంగా పోడు భూముల సమస్య పరిష్కారం, అటవీరక్షణ, హరితహారంపై చర్చించారు. జిల్లా లో రెండు మండలలో భూములు ఉన్నాయని వాటిని రెవ్యునెవ్ అటవిశాఖ  కలిసి సర్వేనిర్వహించాలని సూచించారు. సర్వ్ తరువాత గ్రామా లలో   సమావేశాలు ఏర్పాటు చేసి ఆర్వోఎఫ్‌ఆర్‌ చట్టం ప్రకారం గ్రామ కమిటీల నియామకం చేపట్టాలన్నారు. గతంలో పోడు భూముల సమస్యలపై వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఆర్ఓఆర్, భూ రికార్డుల్లో పేరు ఉన్న వారికి హక్కు పత్రాలు అందించామని తెలిపారు. అడవి బిడ్డలు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని, పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు అధికారులను కోరారు. సమావేశఅనతరం ప్రజా ప్రతినిధులు అధికారుల  అటవీ భూములను కాపాడుతము ప్రతిజ్ఞ చేశారు.

ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ కె చంద్ర రెడ్డి, అటవీశాఖ అధికారి గంగి రెడ్డి, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Share This Post