అటవీ ప్రాంతాల్లో చేపట్టే రోడ్ల పనులను వేగవంతం చేయాలి – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్

సెప్టెంబర్ 03, 2021ఆదిలాబాదు:-

పంచాయితీ రాజ్, రోడ్లు భవనాలు శాఖల ద్వారా చేపట్టే రోడ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలనీ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శుక్రవారం రోజున కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో జిల్లాలోని వివిధ అటవీ ప్రాంతాలలో చేపట్టే రోడ్ల నిర్మాణ పనుల ప్రగతి పై పంచాయితీ రాజ్, రోడ్లు భవనాలు శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, పంచాయతిరాజ్ ఇంజినీరింగ్ విభాగం ద్వారా 15 రోడ్ల పనులకు, రోడ్లు భవనాలు శాఖ ద్వారా 3 రోడ్లకు జిల్లా స్థాయిలో అటవీ శాఖ అనుమతులు పూర్తీ చేసి రాష్ట్ర స్థాయికి ప్రతిపాదనలు పంపడం జరిగిందని అన్నారు. పనులు త్వరగా పూర్తీ చేయాలనీ ఇంజనీరింగ్ విభాగం, అటవీ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. టైగర్ జోన్ పరిధిలోని రోడ్లకు సంబంధించిన అనుమతులను త్వరితగతిన పూర్తీ చేయాలనీ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, జిల్లా అటవీ అధికారి రాజశేఖర్ పెట్ల, పంచాయితీ రాజ్, రోడ్లు భవనాలు శాఖ అధికారులు, అటవీ శాఖ డివిజన్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

…………………………………………………………….. జిల్లా పౌర సంబంధాల అధికారి, ఆదిలాబాదు గారిచే జారీ చేయనైనది.

Share This Post