అటవీ ప్లాంటేషన్లు ధ్వంసం చేస్తే కటిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ అనుదీప్ హెచ్చరించారు.

అటవీ భూములలో ఇటీవల హరితహరం కార్యక్రమం క్రింద పాల్వంచ డివిజన్ పరిధిలో బండారుగుంపు మరియు భద్రాచలం డివిజన్ పరిధిలో సబ్బంపేట బీట్ నందు వేసిన ప్లాంటేషన్స్ స్థానిక గ్రామస్తులు పోడు వ్యవసాయం పేరుతో ధ్వంసం చేసారని,  ఇట్టి చర్యలు  చాలా  సీరియస్ గా పరిగణించి కఠిన చర్యలు తీసుకుంటామని,  దీనిపై జిల్లా కలెక్టర్ స్పందిస్తూ అటవీ భూములు ఆక్రమించుటకు ప్రయత్నించినా,  ప్లాంటేషన్స్ ధ్వంసం చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అడవుల నరికివేతకు పాల్పడే వ్యక్తులను ఏ మాత్రం ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 8వ తేదీ సోమవారం నుండి పోడు భూముల ప్రక్రియపై గ్రామ పంచాయతీల వారిగా అవగాహన కార్యక్రమాలు నిరవహించనున్నట్లు చెప్పారు. అవగాహన  కార్యక్రమాల్లో పోడు దరఖాస్తులు స్వీకరణతో పాటు నూతనంగా  అడవులు నరికివేతకు పాల్పడితే తీసుకునే కఠిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. పోడు భూముల సమస్యపై గ్రామాల వారీగా దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందని, పోడు భూముల  దరఖాస్తులు ఉచితంగా అందచేస్తున్నామని, ప్రజలు ఒక్క రూపాయి కూడా  చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పారు. దరఖాస్తులు పేరుతో  ఎవరైనా ప్రజల నుండి డబ్బులు తీసుకున్నా, అక్రమాలకు పాల్పడినా, దళారుల ప్రమేయం ఉన్నా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చెప్పారు. పోడు  ఫిర్యాదుల కొరకు కలెక్టరేట్ నందు ప్రత్యేకంగా పిర్యాదుల  బాక్స్ ఏర్పాటు చేశామని, లిఖిత పూర్వకంగా రాసిన ఫిర్యాదును బాక్స్ లో వేయాలని, ఫిర్యాదు చేసిన వ్యక్తుల సమాచారం అత్యంత  గోప్యంగా ఉంచుతామని చెప్పారు.  దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరుగుతుందని,  ప్రజలు ప్రలోభాలకు గురై మోసపోవద్దని  చెప్పారు. పోడుపై ఏమైనా  సలహాలు, సూచనలు, ఫిర్యాదులు కొరకు కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన 08744-241950 కంట్రోల్ రూము నంబర్ కు కానీ  9392919743 వాట్స్ యాప్ నంబర్ కు కానీ సమాచారం ఇవ్వాలని కలెక్టర్ పేర్కొన్నారు.

 

Share This Post