అటవీ భూమి సాగు చేస్తున్న రైతులకు హక్కులను పొందేందుకు పూర్తిస్థాయి అవగాహన కల్పించి దరఖాస్తులు స్వీకరించాలని జిల్లా కలెక్టర్ డి హరిచందన అధికారులను ఆదేశించారు

అటవీ భూమి సాగు చేస్తున్న రైతులకు హక్కులను పొందేందుకు పూర్తిస్థాయి అవగాహన కల్పించి దరఖాస్తులు స్వీకరించాలని  జిల్లా కలెక్టర్ డి హరిచందన అధికారులను ఆదేశించారు.

మంగళవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరం లో తహసిల్దార్లు, యంపిడిఓలు, యంపిఓ మరియు పంచాయతి సెక్రటరిలతో పోడు భూముల పై నిర్వహించిన సమావేశం లో జిల్లా కలెక్టర్ డి హరిచందన పలు సూచనలు చేశారు.  రాష్ట ప్రభుత్వం ఆదేశానుసారంగా అటవి భూములను కాపాడాలనే ఉద్యేశ్యం తో పాటు పోడు భూముల సమస్యలను పరిష్కరించలానే ఉద్యశ్యంతో జిల్లాలలో అఖిల పక్షసమావేశాలను ఇప్పటికే నిర్వహించి నవంబర్ 8 తేది నుండి పోడు క్లేమ్స్ స్వికరించేందుకు  ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. పోడు సాగు చేసుకుటున్న గిరిజనులు తదితరుల నుండి క్లెయిమ్స్ స్వీకరించే ముందు వారికి దరఖాస్తులు ఎలా చేసుకోవాలి, జతపర్చాల్సిన పత్రాలు, తాము  హక్కుదారులమని నిరూపించుకునేందుకు ఉన్న అవకాశాల పై అవగాహన కల్పించాలన్నారు.    గ్రామాలలో టం టాం వేయించి గ్రామా లలో గ్రామా సభలు నిర్వహించి FRC కమిటి ని తీర్మానం చేయాలనీ జిల్లా కలెక్టర్ డి హరిచందన తెలిపారు. గ్రామాలకు నోడేల్ అఫిసర్ గా గ్రామా పంచాయతి కార్యదర్శి ఉంటాడని తెలిపారు. ఎలాంటి అవకతవకలు జరుగకుండా  జాగ్రతగా వచ్చే క్లేమ్స్ లను క్షుణ్ణంగా పరిశీలించి స్వికరించాలని సూచించారు. ఎలాంటి సమస్యలు ఏర్పడిన వెంటనే సంబందిత పై అధికారికి తెలియజేయలన్నారు. తప్పనిసరిగా త్రిరిజిస్టర్ మెంటేన్ చేయాలి.

ఈ సమావేశం లో అదనపు కలెక్టర్ కే చద్రరెడ్డి, DFO వీణవాని, అర్దిఒ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Share This Post