అటవీ భూములను సాగు చేస్తూ జీవనం సాగిస్తున్న అర్హులైన గిరిజనులకు హక్కు పత్రాలు అందించేందుకు ఈరోజు నుండి గ్రామ కమిటీలు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుంది-  జిల్లా అటవీ  శాఖ అధికారి  జానకి రామ్

అటవీ భూములను సాగు చేస్తూ జీవనం సాగిస్తున్న అర్హులైన గిరిజనులకు హక్కు పత్రాలు అందించేందుకు ఈరోజు నుండి గ్రామ కమిటీలు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని  జిల్లా అటవీ  శాఖ అధికారి  జానకి రామ్  తెలిపారు.

సోమవారం జిల్లా అటవీ  శాఖ అధికారి  జానకి రామ్ అధ్యక్షతన పోడు భూముల శాశ్వత పరిష్కారంలో భాగంగా మంచాల, హయత్ నగర్, అబ్దుల్లాపురమెట్ మండలలోని, తాళ్ళపల్లిగూడ, తిప్పాయిగూడ, రంగాపూర్, సాహేబునగర్, కుతుబుల్లాపూర్, తట్టిఅన్నారం మరియు పోల్కంపల్లి గ్రామాలలో గ్రామ సభలను నిర్వహించడం జరిగింది.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, అడవి భూములలో సాగు చేసుకుంటున్న అర్హులైన గిరిజనులకు న్యాయం చేకూరచ్చుటకు, ఇక ముందు అడవి భూములు అక్రమణలకు గురి కాకుండా సంరక్షించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.  అర్హులైన గిరిజనులు దరఖాస్తు చేసుకొనుటకు అవసరమైన ఫారాలను గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉచితంగా అందించడం జరుగుతుందన్నారు. ఫారం నింపరాని వారికి గ్రామ కార్యదర్శులు సహకరించాలని సూచించారు.  దరఖాస్తు ఫారాలతో పాటు ఆధార్ కార్డు, కాస్తూ ధ్రువ పత్రాలు జత చేయాలని తెలిపారు. వచ్చిన దరఖాస్తులను గ్రామ కమిటీ నిర్ధారించి జిల్లా కమిటీకి పంపడం జరుగుతుందన్నారు.  అర్హులైన ST లకు హక్కు పత్రాలు అందించడం జరుగుతుందని తెలిపారు.

ఈ గ్రామ సభలలో గ్రామ సర్పంచులు, పంచాయతీ సెక్రెటరీలు , గిరిజన సంక్షేమ శాఖ, రెవిన్యూ శాఖ, అటవీ శాఖ ల అధికారులు, తదితరులు  పాల్గొన్నారు .

 

Share This Post