అటవీ భూములలలో అటవీ పునరుజ్జీవ కార్యక్రమాల ద్వారా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని (ఫారెస్ట్ రిజువనేషన్) జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ అధికారులకు సూచించారు.

మంగళవారం భువనగిరి మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో అటవీ అధికారులు, మండల అభివృద్ధి అధికారులు,  ఉపాధి హామీ అధికారులతో అటవీ పునరుజ్జీవ కార్యక్రమం, అవెన్యూ ప్లాంటేషన్ లపై జరిగిన  సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అటవీ అధికారులు, మండల అధికారులు సమన్వయంతో ఫారెస్ట్ భూములలో ఉపాధి హామీ ద్వారా పనుల  చేపట్టాలని, 10 బ్లాకులలో  వచ్చే జనవరి మాసంలో 70 వేల మొక్కలు నాటేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని,  అటవీ భూములలో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయాలని, ఒక్కో ఫారెస్ట్ బీట్ అధికారి 10 హెక్టార్లలో ప్లాంటేషన్ చేపట్టాలని తెలిపారు. గ్రామాలలో అవెన్యూ ప్లాంటేషన్ పరిశీలనలో  క్రింద ప్రతి కిలోమీటర్ కు ఒకరిని నియమించాలని, మొక్కల సంరక్షణ పకడ్బందీగా చేపట్టాలని, క్రమం తప్పకుండా ప్రతి మొక్కకు నీరు అందే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నేషనల్ హైవే,  పంచాయతీ రాజ్,  ఆర్ అండ్ బి రోడ్లు,  ఇంటర్నల్ రోడ్లకు ఇరువైపుల అవెన్యూ ప్లాంటేషన్ పకడ్బందీగా నిర్వహించాలని, ముఖం చనిపోయిన స్థానంలో కొత్త మొక్కలు నాటి రక్షణ చర్యలు చేపట్టాలని తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఉపేందర్రెడ్డి,  జిల్లా అటవీ అధికారి వెంకటేశ్వర్ రెడ్డి,  అడిషనల్ డిఆర్డిఓ నాగిరెడ్డి, శ్యామల, అధికారులు పాల్గొన్నారు.

Share This Post