అటవీ భూములు, రెవెన్యూ భూములు అని తేడా లేకుండా ఉన్నపుడు అడవి ఫల సాయం పై ఆధారపడి జీవించే గిరిజనులకు న్యాయం చేయాలని, హక్కులు కల్పించేందుకు ఈ అటవీ హక్కుల చట్టం వచ్చింది.రాష్ట్ర గిరిజన, స్త్రీ -శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ 

* ప్రచురణార్థం * జయశంకర్ భూపాలపల్లి అక్టోబర్ 30 (శనివారం).

పోడు భూముల సమస్య పరిష్కారం, అడవుల సంరక్షణపై జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ఏ.ఎస్.ఆర్ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర గిరిజన, స్త్రీ -శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారి నేతృత్వంలో జరిగిన అఖిల పక్ష సమావేశానికి ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, కలెక్టర్ భవేష్ మిశ్రా, ఎస్పి సంగ్రామ్ సింగ్, రైతు సమన్వయ సమితి జిల్లా సమన్వయ కర్త పల్లా బుచ్చయ్య, అఖిల పక్ష నేతలు, అధికారులు హాజరయ్యారు.

సమావేశంలో మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారి వ్యాఖ్యలు…

అటవీ భూములు, రెవెన్యూ భూములు అని తేడా లేకుండా ఉన్నపుడు అడవి ఫల సాయం పై ఆధారపడి జీవించే గిరిజనులకు న్యాయం చేయాలని, హక్కులు కల్పించేందుకు ఈ అటవీ హక్కుల చట్టం వచ్చింది.రాష్ట్ర గిరిజన, స్త్రీ -శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్

పోడు చట్టం వచ్చిన తరవాత గిరిజన సంక్షేమ శాఖ నొడల్ ఏజెన్సీ గా ఉండి కొంతమందికి పట్టాలు ఇచ్చారు. కానీ సరైన విధంగా పొజిషన్ ఇవ్వలేదు. భూములను వ్యవసాయ యోగ్యంగా చేయలేదు. ఫలితంగా ఈ పోడు పెరుగుతూ వచ్చింది.

చట్టం వచ్చాక 6,90,059 క్లెయిమ్స్ వచ్చాయి. వీటిలో 96,676 క్లెయిమ్స్ కు హక్కు పత్రాలు ఇచ్చారు. మరో 91,942 క్లెయిమ్స్ అనర్హత కలిగినవి గా గుర్తించి తిరస్కరిస్తే..15,558 క్లెయిమ్స్ పెండింగ్ లో ఉన్నాయి.

అర్హులకు అందరికీ గ్రామ సభ నిర్దారణ మేరకు హక్కు పత్రాలు ఇవ్వడంతో పాటు.. అడవిని కూడా కాపాడాలన్నది సీఎం కేసిఆర్ గారి లక్ష్యం.

ఇప్పటి వరకు అనేక గిరిజన ఆవాసాలకు కరెంట్ లేదని గుర్తించి ప్రతి గిరిజన ఆవాసానికి 3 ఫేస్ కరెంట్ ఇవ్వడానికి 230 కోట్ల రూపాయలు ఇచ్చారు. ప్రతి ఆవాసానికీ రోడ్ సదుపాయం కల్పించారు.

కేసులు లేకుండా చేసే బాధ్యతను తీసుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించే ప్రయత్నం చేస్తాను.

కొంతమంది అమాయక గిరిజనులను అడ్డు పెట్టుకొని గిరిజన భూముల్లో ఉన్నారు. ఇలాంటి వారి దగ్గర నుంచి భూమి వెనక్కి తీసుకుని పేదలకు పంచుతాం.

గుత్తి కోయలు ఛత్తీస్ ఘడ్ గిరిజనులు. తెలంగాణ ఏర్పడిన తరవాత నోటిఫైడ్ అయిన గిరిజన జాబితాలో గుత్తి కోయలు లేరు.

ఈ దేశంలో ఎక్కడి వారు ఎక్కడైనా జీవనోపాధి పొందవచ్చు. కానీ అక్కడి హక్కులు లభించవు. అదే విధంగా గుత్తి కోయలకు సంబంధించి ఏమి చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది.

కరోనా సమయంలో వలస కార్మికులు దాదాపు 33 లక్షల మందికి భోజనం పెట్టి, ఖర్చులకు డబ్బులు ఇచ్చి ఆదుకున్న గొప్ప మనసున్న నేత సీఎం కేసీఆర్ గారు. కాబట్టి ఈ నాలుగైదు వేల గుత్తి కోయల విషయంలో కూడా న్యాయం చేస్తారనే నమ్మకం నాకుంది.

మనమంతా కలిసి చర్చించుకుని అందరికీ న్యాయం జరిగే విధంగా పని చేద్దామని కోరుతున్నాను. నవంబర్ 6వ తేదీన ఇక్కడ మరో సమావేశం పెట్టుకుని చర్చిద్దాం.

జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా– జిల్లాలో 1387 మందికి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలను గతంలో పంపిణీ చేయడం జరిగిందని ప్రస్తుతం ప్రభుత్వం పోడు భూముల పై చర్యలు తీసుకుంటునందున ప్రభుత్వ నిర్ణయం మేరకు జిల్లా యంత్రాంగం నడుచుకుంటదని తెలిపారు. మంథని శాసనసభ్యులు శ్రీధర్ బాబు— పోడు భూముల సమస్యను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం సంతోషకరమైన విషయమని, ఆర్ఓఎఫ్ఆర్ పత్రాలను పొంది భూములను సాగు చేసుకుంటున్న రైతులపై అటవీశాఖ వారు పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని, ఆర్ఓఎఫ్ఆర్ హక్కు పత్రాలు ఉన్న భూములకు రైతుబంధు, పంట రుణాలు అందించాలని, ఫారెస్ట్ భూములపై రెవెన్యూ, అటవీశాఖ సంయుక్త బృందాలను ఏర్పాటు చేసి జాయింట్ సర్వే చేసి పరిష్కరించాలని, పోలీస్ శాఖ వారు తొందరపడి ఆదివాసి, గిరిజన రైతులపై కేసులు పెట్టొద్దని అన్నారు. భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి—- ఆర్ ఓ ఎఫ్ ఆర్ చట్టం 2006 ప్రకారం గతంలో పట్టాలు ఇచ్చినప్పుడు పూర్తిస్థాయిలో సమస్యలను పరిష్కరించకపోవడం మూలంగా ఇప్పటికీ అదే సమస్య పునరావృతం అవుతుందని ఇప్పటికైనా పారదర్శకంగా పోడు భూములను పరిశీలించి అర్హత ఉన్న వారికి అందరికీ ఆర్ఓఎఫ్ఆర్ హక్కు పత్రాలను అందించాలని, ఆర్ఓఎఫ్ఆర్ భూములలో వ్యవసాయం చేసుకోవడానికి బోర్లు వేసుకోవడానికి అనుమతివ్వాలని, కరెంటు సౌకర్యం కల్పించాలని, యంత్రాలతో వ్యవసాయం చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, బిజెపి, టిఆర్ఎస్, సిపిఐ, సిపిఎం, వైయస్సార్ సిపి, ఆదివాసీ, గిరిజన సంఘాల నాయకులు అటవీ భూములపై ఆధారపడి పోడు వ్యవసాయం చేసుకుంటున్న ఎస్టీల తో పాటు ఇతర కులాలలోని పేద వారికి కూడా ఆర్ఓఎఫ్ఆర్ హక్కు పత్రాలను అందించాలని కోరారు. ఈ సందర్భంగా పోడు భూముల సమస్య పరిష్కారంపై జిల్లా అటవీశాఖ అధికారి లావణ్య ప్రజా ప్రతినిధులు, అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ కూరాకుల స్వర్ణలత, జిల్లా అదనపు కలెక్టర్ టిఎస్. దివాకర, ఆర్డీవో శ్రీనివాస్, మున్సిపల్ చైర్ పర్సన్ షెగ్గం వెంకటరాణి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేష్ నాయక్, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపిటిసిలు, జిల్లా స్థాయి అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. డిపిఆర్ఓ జయశంకర్ భూపాలపల్లి జిల్లా గారిచే జారీ చేయడమైనది.

Share This Post