ప్రచురణార్ధం
అటవీ భూముల పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ హరిత అన్నారు.
బుధవారం కలెక్టర్ చాంబర్లో జిల్లా స్థాయి అటవీ పరిరక్షణ కమిటీ సమావేశం జరిగింది .
ఈ కమిటీకి చైర్మన్గా వ్యవహరిస్తున్న కలెక్టర్ హరిత మాట్లాడుతూ అటవీ భూముల సంరక్షణ,అడవులను పునరుద్ధరించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
అటవీ భూములను సంరక్షించేందుకుగానూ అటవీ, రెవెన్యూ, పోలీస్ అధికారులు సంయుక్త బాధ్యత తీసుకోవాలన్నారు.
అడువులను పునర్జీవనం చేసేందుకు చేపట్టే పనులను పర్యవేక్షించడానికి ప్రత్యేక అధికారిని నియమంచాలన్నారు.
అటవీ సంరక్షణ, అభివృద్ధి,ఆక్రమణ సమస్యల పైన కలెక్టర్ dcp,dfo తో చర్చిండం జరిగింది .
అనంతరం హరితహారం కార్యక్రమం పైన మాట్లాడుతూ
మొక్కలు నాటే లక్ష్యాలను అన్నీ శాఖలవారు పూర్తి చేసి
జిల్లాను ప్రథమస్థానంలో నిలబెట్టాలన్నారు.
త్వరతిగతిన అన్నీ డిపార్ట్మెంట్ వారు తమకు నిర్దేశించిన హరితహారం పనులను పూర్తి చేయాలన్నారు .
ఈ సమావేశంలో dcp వెంకటలక్ష్మి, dfo అర్పణ,అగ్రికల్చర్ jda ఉష దయాల్, pd drdo, dpo , నర్సంపేట, వర్ధన్నపేట,పరకాల మున్సిపల్ కమీషనర్లు పాల్గొన్నారు.