అటవీ భూముల సంరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలి:: జిల్లా కలెక్టర్ జి.రవి
అటవీ భూముల సంరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలి:: జిల్లా కలెక్టర్ జి.రవి
జగిత్యాల , ఆగస్టు 04:- జిల్లాలో ఉన్న అటవీ భూముల సంరక్షణకు ప్రథమ ప్రాధాన్యత కల్పిస్తు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జి.రవి సంబంధిత అధికారులను ఆదేశించారు. అడవుల పునరుద్దరణ, సంరక్షణ తదితర అంశాల పై బుధవారం మిని పద్మనాయక ఫంక్షన్ హాల్ లో జిల్లా స్థాయి అటవీ సంరక్షణ కమిటి సభ్యులతో సమావేశం నిర్వహించారు. 2,41,900 హెక్టార్ల విస్తీర్ణంతో జగిత్యాల జిల్లా ఏర్పడిందని, అందులో 22.21% అంటే 53734.79 హెక్టార్ల భూమి అటవీ భూమి 83 బ్లాక్ లో ఉందని అధికారులు వివరించారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో అటవీ నేరాల కింద రూ.65,13,143/- జరిమానా రుసుము, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకు రూ.16,19,052/- జరిమానా రుసుము వసూళ్లు చేసామని అధికారులు తెలిపారు. అడవీలో స్మగ్లింగ్ మరియు జంతువుల అక్రమ తరలింపుకు అలవాటు పడిన 21 మందిని గుర్తించామని, వారికి అటవీ రేంజ్ అధికారులతో సమావేశం నిర్వహించి పద్దతి మార్చుకోవాలని సూచించామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 334 కార్పెంటర్ యూనిట్లు/ ధూగోడ యంత్రాలు , 54 సా మిల్లులు, 54 కలప డిపోలు ఉన్నాయని తెలిపారు. 2020-21 సంవత్సరంలో 24.356 హెక్టర్ల అటవీ భూమి ఆక్రమణకు గురైందని, దీని పై 26 కేసులు బుక్ చేసామని తెలిపారు. ధర్మపురి రేంజ్ పరిధిలో 1543 మందికి2679 ఎకరాల భూమి బీర్ పూర్ తహసిల్దార్ పట్టాలు జారీ చేసారని తెలిపారు. జిల్లాలో ఉన్న అటవీ భూముల సంరక్షణకు అధిక ప్రాధాన్యం కల్పించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. తెలంగాణకు హరితహారంలో భాగంగా ప్రతి గ్రామంలో నర్సరీ ఏర్పాటు, మొక్కలు నాటి సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు తదితర వాటిలో అటవీ శాఖ సిబ్బంది అందిస్తున్న సిబ్బందులు బాగా పనిచేసాయని కలెక్టర్ అభినందించారు. సీఎం కేసిఆర్ కలెక్టర్ల సమావేశం నిర్వహించిన సమయంలో అడవుల సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యల పై ప్రత్యేక సూచనలు అందించారని, జగిత్యాల జిల్లా సారంగ మండలంలో రేచుపల్లి గ్రామంలో జరుగుతున్న అక్రమ కలప రవాణా పై పలు సూచనలు చేసారని తెలిపారు. సీఎం సూచనల ప్రకారం తీసుకున్న చర్యల వల్ల రేచుపల్లి గ్రామంలో సా మిల్లుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో అటవీ భూములో తహసిల్దార్లు జారీ చేసిన పట్టాలను సాటిలైట్ మ్యాప్ వినియోగిస్తు క్షేత్రస్థాయిలో విచారణ చేయాలని, ఆక్రమ పట్టాలను వెంటనే తొలగించే విధంగా నివేదిక సిద్దం చేయాలని కలెక్టర్ సూచించారు. అటవీ భూముల పై జరుగుతున్న ఆక్రమణల పై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అక్రమ కలప రవాణా జర్గకుండా కట్టుదిట్ట చర్యలు తీసుకోవాలని, క్షేత్రస్థాయిలో నిరంతరం తనిఖీలు నిర్వహించాలని, సా మిల్లులో సిసి కేమెరాలు ఏర్పాటు చేసి వాటి పుటేజ్ పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, సీతారామ ఎత్తిపోతల పథకం, రోల్ల వాగు ప్రాజేక్టుల నిర్మాణం అందించిన అటవీ భూముల ప్రత్యహమ్నయంగా అందించిన భూముల పై పలు ఫిర్యాదులు ఉన్నాయని, వాటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. సీతారామ ఎత్తిపోతల పథకం కింద మెడిపల్లి మండలంలో 326.354 హెక్టార్ల భూమి 10 ప్రదేశాలో గుర్తించి అందించారని, వాటిలో 8 ప్రాంతాలో పట్టా సమస్యలు, బౌండరీ సమస్యలు ఉన్నాయని, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కింద వెల్గటూర్ , కొడిమాల మండలాలో 500.926 హెక్టార్ల భూమి 8 ప్రదేశాలలో గుర్తించారని, వాటిలో వెల్గటూరు మండలంలోని కొండాపూర్ గ్రామంలో సర్వే నెం. 512,153 లో 165 ఎకరాల అటవీ భూమి తిరిగి కేటాయించారని, దీనికి బదులు మరో ప్రాంతంలో భూమి గుర్తించి అందించాలని , రోల్లవాగు ప్రాజేక్టు విషయంలో సైతం 5 ప్రాంతాలో పట్టా సమస్యలు ఉన్నాయని అటవీ అధికారులు వివరించారు.
ఈ సమావేశంలో కరీంనగర్ ఫారెస్ట్ కన్వీసటైర్ సైదులు,జిల్లా అటవీ అధికారి వెంకటేశ్వర్ రావు, డి.ఆర్.డి.ఓ. వినోద్, డి.పి.ఓ. నరేష్ , కృష్ణారావు సర్పంచ్ కమిటీ సభ్యులు, సంబంధిత అటవీశాఖ అధికారులు తదితరులు పాల్గోన్నారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, జగిత్యాల చే జారిచేయనైనది.
అటవీ భూముల సంరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలి:: జిల్లా కలెక్టర్ జి.రవి
