అటవీ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్*

అటవీ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్*

రాజన్న సిరిసిల్ల, నవంబర్ 1: అటవీ పరిరక్షణ, పోడు భూములు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్ష లో అటవీ అధికారులతో అడవుల విస్తీర్ణం, పోడు భూములకు సంబంధించిన అంశాలపై చర్చించారు. జిల్లాలోని అటవీ సంపదను కాపాడాలని అధికారులను ఆదేశించారు. పోడు భూములకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ముందుకు సాగాలని సూచించారు. అడవులను సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉంటుందని గుర్తుచేశారు. అలాగే ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామ శివారులో ఏర్పాటు చేస్తున్న ఫారెస్ట్ అర్బన్ పార్కు పనుల పురోగతిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. పనులు వేగవంతంగా పూర్తి చేయడానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమీక్షలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్య ప్రసాద్, జిల్లా అటవీ శాఖ అధికారిణి బాలామణి, ఇంచార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి టి. శ్రీనివాస రావు, ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాస్, ఫారెస్ట్ రేంజ్ అధికారులు శ్రీనివాస్, ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

Share This Post