అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టే పనులకు అనుమతులు పొందాలి..

ప్రచురణార్థం

అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టే పనులకు అనుమతులు పొందాలి..

మహబూబాబాద్ సెప్టెంబర్ 24.

అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టే పనులకు తప్పనిసరిగా అనుమతులు పొందాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.

శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో అటవీ అనుమతులపై జిల్లా స్థాయి ముందస్తు సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వన్య ప్రాణుల సంరక్షణ ప్రాంతంగా మూడు మండలాలు నమోదయి ఉన్నాయని, గూడూరు, కొత్తగూడ, గంగారం గా తెలియజేశారు.
ఆయా మండలాల్లో చేపట్టే పనులకు తప్పనిసరిగా అటవీశాఖ అనుమతులు అవసరం అన్నారు. అలాగే బయ్యారం, గార్ల, నెల్లికుదురు వంటి మండలాల్లో కూడా చేపట్టే పనుల ను అటవీ శాఖ అధికారుల కు తెలియజేస్తూ వారి సహకారంతోనే చేపట్టాలని అన్నారు.

విద్యుత్, నీటిపారుదల, వ్యవసాయ కనెక్షన్లు పంచాయతీ రాజ్ రోడ్లు భవనాలు మత్స్య శాఖ తదితర శాఖల అభివృద్ధి పనులు చేపట్టేందుకు ముందస్తు అనుమతులు తప్పనిసరి గా పొందాలన్నారు.

ఈ సమావేశంలో జిల్లా ఫారెస్ట్ అధికారి రవి కిరణ్ అదనపు కలెక్టర్ లు అభిలాష అభినవ్, కొమరయ్య, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు
—————————————————–
జిల్లా పౌరసంబంధాల అధికారి మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post