అటవీ సంపదను సంరక్షించాలి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్.

అటవీ సంపద పెంచుకుంటేనే భవిష్యత్తు తరాలకు ప్రాణవాయువు పుష్కలంగా లభిస్తుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అన్నారు. అడవుల ఆవశ్యకతను గుర్తించి ప్రభుత్వం హరితహారం కింద మొక్కలు నాటి పచ్చదనం పెంపు ఎంతో దోహదపడుతుందని తెలిపారు. అటవీ సంరక్షణ, పోడు వ్యవసాయంపై  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ శుక్రవారం  జిల్లా కలెక్టర్లు, అదనప కలెక్టర్ ల్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అటవీ భూములు ఆక్రమణకు గురికాకుండా, మొక్కల సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు.
వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి, అదనపు కలెక్టర్లు మోహన్ రావు,  పాటిల్ హేమంత్ కేశవ్,  డిఎప్ఓ  ముఖుంద రెడ్డి, డి.పి. ఓ యాదయ్య, సంబంధిత శాఖల అధికారులు తదితరులు  పాల్గొన్నారు.

Share This Post