అడవులను కాపాడుకోవాలి :: జిల్లా కలెక్టర్ డి . హరిచందన

పత్రిక ప్రకటన

నారాయణపేట జిల్లా

తేది:03-08-2021

 

 

అడవులను కాపాడుకోవాలి :: జిల్లా కలెక్టర్ డి . హరిచందన

మంగళవారం మద్యాహ్నం కలెక్టరేట్ సమావేశ మందిరం లో అటవీ ల అభిరుద్ది పై అధిలరులతో జిల్లా కలెక్టర్ డి హరిచందన సమావేశం నిర్వహించారు.   జిల్లాలోని ఆటవుల సంరక్షణ మరియు పునరుజివనం అనే అంశం పైన అటవీశాఖ తో నిర్వహించిన  సమావేశంలో  జిల్లా కలెక్టర్  డి హరిచందన మాట్లాడుతూ అడువులను కాపాడుకోవడానికి ప్రత్యెక దృష్టి సారించాలని ప్రణాళికా సిద్దం చేయాలనీ అధికారులకు ఆదేశించారు. అడువుల వలన వర్షపాతం       పెరుగుతుందని అలాగే అడవులలో నివసించే వన్యప్రాణులు కూడా పెరుగుతాయని సూచించారు.  జిల్లా కలెక్టర్ గారు ఎన్.ఆర్.జి.యెస్. ద్వారా ఆటవుల అభివృద్ధి కార్యక్రమాలు రెండు శాఖల మధ్య సమన్వయంతో చేపట్టాలని జిల్లా అటవీశాఖ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులను ఆదేశించారు. ఆటవులలో నీటి సంరక్షణ చర్యలలో భాగంగా చెక్ డాం, పెరుకోలేషన్ ట్యాంక్ ల నిర్మాణం చెప్పటలని ఆదేశించారు.

ఇట్టి సమావేశంలో జిలా అటవీశాఖ అధికారి గంగా రెడ్డి గారు అటవీశాఖ ఆధ్వర్యంలో అటవీ ప్రాంతాల్లో చేస్తున్న పనులను పవర్ పాయింట్ ద్వారా జిల్లా కలెక్టర్ మరియు అధికారులకు వివరించారు. అలాగే రాబోయే రోజుల్లో ఆటవుల పునరికరణ కొరకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. నారాయణ పెట్ జిల్లాలో దట్టమైన అడవి పెంపొందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించడం జరిగింది.

ఈ కార్యక్రమం లో డిఅర్దిఒ  గోపాల్ నాయక్, డిపిఒ మురళి, అటవీ క్షేత్రాధికారి నారాయణరావు, ఎంపిడిఓ లు, అటవీశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

______

జిల్లా పౌర సంబంధాల అధికారి ద్వారా జరి.

Share This Post