ప్రెస్ రిలీజ్
24.03.2023.
డిస్త్రిక్ ప్రైస్ మానిటరింగ్ కమిట్టి మీటింగ్
శుక్రవారం రోజున IDOC లోని అడిషనల్ జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో… అడిషనల్ జిల్లా కలెక్టర్ సంధ్యా రాణీ ఆధ్వర్యంలో… జిల్లా సరఫరాల అధికారి వసంత లక్ష్మీ అధ్యక్షతన…. పౌరసరఫరాల శాఖ, ఎన్ఫోర్స్మెంట్ శాఖ, తునికల కొలతలు శాఖ, వ్యవసాయ శాఖ, రైతు బజార్ ఎస్టేట్, మార్కెటింగ్, DT(CS)లు మరియు హోల్ సెల్ కిరాణం మర్చంట్ గారులతో డిస్త్రిక్ ప్రైస్ మానిటరింగ్ కమిట్టి మీటింగ్ నిర్వహించారు.
ఇట్టి సమావేశములో అడిషనల్ జిల్లా కలెక్టర్…. అత్యవసర వస్తువుల యొక్క ధరలు గూర్చి అనగా ఆహార ధాన్యాలు, పప్పులు, నూనెలు, కూరగాయలు, పాలు ఇతర వస్తువుల పై సరుకుల నిలువలు మరియు ధరల నియంత్రణ గురించి పై అధికారులతో చర్చించి, హెచ్చు తగ్గులను ఉద్దేశించి ధరలను నియంత్రణ చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇట్టి సమావేశములో పి.వసంత లక్ష్మి జిల్లా పౌరసరఫరాల అధికారి, హనుమకొండ, సి.రాజు DSP విజిలెన్సు & ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, యు.మహేందర్ జిల్లా మేనేజర్, యం. అనిల్ కుమార్ జిల్లా తునికల కొలతలు శాఖ అధికారి, ఎ. మురళి మోహన్ వ్యవసాయ అధికారి, వి.శ్రీనివాస్ రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్, యండి. షఫిఉద్దిన్ మార్కెటింగ్ ఆఫీసర్, యం. కృష్ణ, జె.రమేష్, కె.సత్యనారాయణ DT(CS)లు మరియు ముకేష్ కుమార్ అగర్వాల్ హోల్ సెల్ కిరాణం మర్చంట్ మరియు పౌరసరఫరాల కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.