*అడ్డమైన మాటలు కాదు…. దమ్ముంటే*
*అభివృద్ధిలో పోటీ పడాలి:
– అన్నింట్లో అగ్రగామి తెలంగాణే
– *రాష్ట్ర ఐటి పురపాలక, పట్టణాభిృద్ధిశాఖ మంత్రి శ్రీ కే* *తారక రామారావు*
——————————
అడ్డమైన మాటలు కాదు….
దమ్ముంటే
అభివృద్ధిలో పోటీ పడాలనీ రాష్ట్ర ఐటి పురపాలక, పట్టణాభిృద్ధిశాఖ మంత్రి శ్రీ కే తారక రామారావు ప్రతి పక్షాలకు సవాల్ విసిరారు. సీఎం కేసిఆర్ నాయకత్వంలో అన్నింట్లో అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందనీ మంత్రి తెలిపారు.
బుధవారం ఎల్లారెడ్డి పేట మండలం బండలింగంపల్లి గ్రామంలో పిరీల మసీదు ను మంత్రి ప్రారంభించారు. మండల పరిషత్ ప్రాధమిక పాఠశాల లో రూ.28 లక్షలతో నిర్మించనున్న ఆధునిక భవన నిర్మాణం, నూతన మౌలిక సదుపాయాల కల్పన పనులకు మంత్రి
శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
..
దేశంలో 6 లక్షల పల్లెల్లో తెలంగాణ పల్లెల్లో జరిగిన అభివృద్ధి ఎక్కడైనా చూపిస్తారా.. అంటూ ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వం నుండి కరీంనగర్ నియోజకవర్గం వెయ్యి కోట్ల ప్రత్యేక ప్యాకేజీ తీసుకురావాలనీ ప్రతి పక్షాలకు డిమాండ్ చేశారు.
భవిష్యత్తు తరానికీ బంగారు బాటలు వేసేదే బడి… బడుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని భావించి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అత్యంత ప్రతిష్టాత్మకంగా మన ఊరు మన బడి కార్యక్రమం కు శ్రీకారం చుట్టారనీ తెలిపారు
మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా మూడు ఎండ్లలో రూ.7 వేల 3 వందల కోట్ల తో 26 వేల ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించనున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమం ద్వారా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్ని అదనపు తరగతులైతే అన్ని తరగతి గదులను నిర్మిస్తామని అన్నారు.విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేలా డిజిటల్ తరగతి గదులను ఏర్పాటు చేస్తామన్నారు.
తెలంగాణలో 973 ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థుల కోసం గురుకుల పాఠశాల ను ఏర్పాటు చేసి 5 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నామన్నారు.
ఒక్కో విద్యార్థి పై లక్షా 25 వేల రూపాయలు ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు.
విదేశాల్లో ఉన్నత విద్య చదివే విద్యార్థులకు డా బి ఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతి రావు పూలే పేరున ఓవర్సీస్ నిధి నీ ఏర్పాటు చేసి రూ.20 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు తెలిపారు.
ఇప్పటి వరకూ 16 వేల కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ క్రింద చెల్లించామని అన్నారు.
అభాగ్యులకు, వృద్ధులకు అసరా పెన్షన్ లు, 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్, త్రాగునీరు, సాగునీరు, కళ్యాణ లక్ష్మి షాది, ముబారక్, రైతు బంధు , భీమా, దళిత బంధు వంటి పథకాలను అమలు చేస్తూ…
పేదలు, రైతుల పక్షపాతి గా కేసిఆర్ నిలిచారని అన్నారు.
కేసిఆర్ ఏది చెప్పినా మొదట అయిత దంటా వా అంటారు….
కేసిఆర్ కు తనపై ఆత్మ విశ్వాసం, ప్రజల పై నమ్మకం ఉంది.
అందుకే అసాధ్యమైనమని భావించిన కాళేశ్వరం ప్రాజెక్ట్, మిషన్ భగీరథ, రైతు బంధు, రైతు భీమా , దళిత బంధు వంటి అనేక పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు.
కాబట్టే రాష్ట్ర ప్రభుత్వం పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయను అన్నారు.
కేసిఆర్ నాయకత్వంలో ప్రభుత్వం చేపట్టే మంచి కార్యక్రమాలు, పథకాల గురించి చెప్పాలంటే ఒక రోజైనా సరిపోదని చెప్పారు.
అసలు కేసిఆర్ లేకపోతే…. తెలంగాణ స్వరాష్ట్ర కాంక్ష సాకారం అయ్యేదా?
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రమే ఉంటే అవాకులు చెవాకులు పేలుతున్న నాయకులను గంజీలో ఈగల్లా గా తీసి వేసేవారు కాదా అని ప్రశ్నించారు.
స్థాయిలేని వ్యక్తులు సీఎం కేసిఆర్ ను అనవసరంగా విమర్శించడం మానుకోవాలని మంత్రి కేటీఆర్ హితవు పలికారు.
బండలింగoపల్లి గ్రామంలో జరిగిన అనేక అభివృద్ధి కార్యక్రమాలను చూస్తే ఆనందం వేస్తుందన్నారు. ఇక్కడ మతసామరస్యం చూస్తే సంతోషంగా ఉందన్నారు. ప్రజల విజ్ఞప్తి మేరకు గ్రామానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, బ్యాంక్, సబ్ స్టేషన్ ను త్వరలో నే మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు.
కార్యక్రమంలో చీఫ్ విప్ శ్రీ దాస్య వినయ్ భాస్కర్,
తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మెన్, మానకొండూర్ శాసనసభ్యులు శ్రీ రసమయి బాలకిషన్, జెడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి ఎన్.అరుణ, జిల్లా కలెక్టర్ శ్రీ అనురాగ్ జయంతి, జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ బి సత్య ప్రసాద్, ఆర్డీఓ శ్రీ శ్రీనివాస్ రావు, జిల్లా విద్యాధికారి శ్రీ డి రాధా కిషన్, తదితరులు పాల్గొన్నారు.
——————————