అతిథి ఉపాధ్యాయుల కోసం దరఖాస్తుల ఆహ్వానం

అతిథి ఉపాధ్యాయుల కోసం దరఖాస్తుల ఆహ్వానం

ఉమ్మడి మెదక్ జిల్లా లోని మహాత్మ జ్యోతిబాపూలే బాలుర ,బాలికల గురుకుల పాఠశాలల్లో తాత్కాలిక పద్ధతిన అతిథి ఉపాధ్యాయులు/లెక్చరర్ల నియామకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మహాత్మ జ్యోతిబాపూలే వెనకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలల రీజినల్ కో-ఆర్డినేటర్ బి. ప్రభాకర్ శుక్రవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.

తెలుగు, హిందీ ,ఆంగ్లము, గణితము, భౌతిక శాస్త్రం ,జీవశాస్త్రం మరియు సాంఘిక శాస్త్రంలో
ఆంగ్ల మాధ్యమంలో బోధించుటకు అర్హులైన అభ్యర్థులు కావాలని తెలిపారు.

అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ మరియు బి.ఇడి. కలిగి ఉండాలన్నారు. ఎంపిక విధానం మెరిట్, డెమో ఆధారంగా జరుగుతుందన్నారు.

అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 9 లోపు ఆయా జిల్లాలలో సమీపంలో గల జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో తమ బయోడేటా, విద్యార్హతల జిరాక్స్ ప్రతులను అందజేయాలని ఆయన తెలిపారు.

మరిన్ని వివరాలకు సంగారెడ్డి జిల్లా సదాశివపేట బాలికల గురుకుల పాఠశాల, మెదక్ జిల్లా కౌడిపల్లి బాలుర గురుకుల పాఠశాల, సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ బాలుర గురుకుల పాఠశాల జిల్లా కన్వీనర్/ప్రిన్సిపాల్ ను సంప్రదించాలని సూచించారు.

అర్హత గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.

Share This Post