అతిధి అధ్యాపకుల నుండి దరఖాస్తుల ఆహ్వానం

అతిధి అధ్యాపకుల నుండి దరఖాస్తుల ఆహ్వానం

సంగారెడ్డి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో తెలుగు, జువాలజీ మరియు కంప్యూటర్ సబ్జెక్టులను బోధించుటకు అతిథి అధ్యాపకుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ హుమెరా సయీధ్ గురువారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.

అర్హులైన అభ్యర్థులు ఈ నెల 12న ఉదయం 10 గంటలకు తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించు ఇంటర్వ్యూలకు హాజరు కావాలని ఆయన సూచించారు.

సంబంధిత సబ్జెక్టులలో పీజీలో 55 శాతం పైగా మార్కులు ఉండి,NET/SLET లేదా పీహెచ్ డి అర్హత గల అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుందని ఆయన తెలిపారు.

Share This Post