అదనపు కలెక్టర్‌గా వచ్చి ఓక ఏడాది 6 మాసాలు,నేడు నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ గా పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టిన – మిక్కిలినేని మనూ చౌదరి

2020 ఫిబ్రవరి 10న నాగర్ కర్నూలు జిల్లాకు అదనపు కలెక్టర్‌ స్థానిక సంస్థల హోదాలో వచ్ఛి. శుక్రవారం పూర్తిస్థాయి పాలనాధికారిగా బాధ్యతలు చేపట్టారు.
అదనపు కలెక్టర్ గా జిల్లాలో తనదైన శైలిలో పాలన సాగిస్తున్న 2017 బ్యాచ్ కు చెందిన యువ ఐఏఎస్‌ అధికారి మిక్కిలినేని మను చౌదరి జిల్లాకు వచ్చి,గురువారం జిల్లా కలెక్టర్ శర్మన్ బదిలీతో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి కలెక్టర్ గా ఆయనను నియమించిది.
శుక్రవారం కలెక్టరేట్ కలెక్టర్ చాంబర్లో అధికారుల సమక్షంలో నూతన కలెక్టర్ బాధ్యతలు చేపట్టారు.
రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాలకు అదనపు కలెక్టర్లను నియమించింది. ఇందులో భాగంగా 2020, ఫిబ్రవరి 10న మను చౌదరి జిల్లా అదనపు కలెక్టర్‌, స్థానిక సంస్థల తొలి అధికారిగా బాధ్యతలు చేపట్టారు. పంచాయతీలు, పట్టణాల స్థాయిలో అభివృద్ధి పనుల వేగవంతానికి, పాలనలో పారదర్శకతకు, ప్రభుత్వ యంత్రాంగంతో సమర్థంగా పనిచేయించేందుకు ఆయన కృషిచేశారు.
జిల్లాలో నాగర్ కర్నూలు పట్టణంలో తొలి కొవిడ్‌ కేసులు నమోదుకాగా..
బాధితుల ఇళ్లకు వెళ్లి కౌన్సెలింగ్‌ ఇచ్చారు.
జిల్లా పరిషత్ సీఈవో, ప్రాజెక్టు అధికారి ఐటిడిఎ, డిఆర్డిఓ పిడి, నాగర్ కర్నూల్ అచ్చంపేట మున్సిపల్ ప్రత్యేక అధికారులుగా అదనపు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడంలో సఫలమయ్యారు.
‘పల్లె, పట్టణ ప్రగతి’, పారిశుద్ధ్యం, హరితహారం, రైతు వేదికలు, డంపింగ్ యార్డ్, స్మశాన వాటికల నిర్మాణ పనుల పురోగతిలో భాగంగా క్షేత్రస్థాయి పర్యటనలకు ఆయన అధిక ప్రాధాన్యమిచ్చారు.
నూతన కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ….
జిల్లా కలెక్టర్‌ శర్మన్ బదిలీ కావడంతో తనకు రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతిపై జిల్లా కలెక్టర్ గా పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించిందన్నారు.
గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని అన్ని శాఖలపై పట్టుసాధించేందుకు ప్రయత్నిస్తూనే అధికార యంత్రాంగాన్ని ఉత్సాహంగా ముందుకు నడిపించేందుకు చర్యలు తీసుకుంటాం అన్నారు.
అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో నాగర్ కర్నూలు జిల్లాలో రాష్ట్రస్థాయిలో మెరుగైన స్థానంలో ఉంచేందుకు కృషి చేస్తానన్నారు.
ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరేలా తన వంతు సహాయ సహకారాలు కొనసాగిస్తానని అన్నారు.
నూతన కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత పలువురు జిల్లా స్థాయి అధికారులు, కార్యాలయ సిబ్బంది తదితరులు ఆయనకు పుష్పగుచ్ఛాలు, మొక్కలు అందించి అభినందనలు తెలిపారు.
నూతన కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టే కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో జాకీర్ అలీ, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు ఉన్నారు.

Share This Post