అదనపు తరగతి గదులు మరియు సైన్సు ల్యాబ్ ను ప్రారంభించిన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్ర రెడ్డి

పత్రిక ప్రకటన,
తేది :- 06.08.2021.

వికారాబాద్ జిల్లా ధారూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 30 లక్షల రూపాయల తో నిర్మించిన అదనపు తరగతి గదులను, 9 లక్షల రూపాయల తో నిర్మించిన సైన్స్ లాబ్ ను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు ప్రారంభించారు. ఈ సందర్బంగా
విద్యార్థులకు డిక్షనరీలు పంపిణీ చేసిన మంత్రి సబితా రెడ్డి గారు,ఎమ్మెల్సీ వాణిదేవి గారు,ఎమ్మెల్యే ఆనంద్ గారు,విద్య మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నాగేందర్ గౌడ్ గారు,జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ గారు.

ఈ సందర్బంగా మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణలో విద్యకు రాష్ట్ర ప్రభుత్వ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కొసం 4 వేల కోట్లతో ప్రతిపాదించడం జసరిగిందని, ప్రయివేటు పాఠశాలలకు దీటుగా అత్యాధునికంగా మార్చటానికి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. విద్యా హబ్ గా, సరస్వతి నిలయంగా తెలంగాణ రాష్ట్రన్ని ఏర్పాటు చేస్తామన్నారు.
ప్రపంచంతో మన తెలంగాణ విద్యార్థులు పోటీ పడేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
విదేశాల్లో మన తెలంగాణ విద్యార్థులు చదువుల కోసం ఓవర్సీస్ స్కాలర్ షిప్ ద్వారా అండగా ప్రభుత్వం ఉంటుందన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు నాలుగు డిగ్రీ కళశాలలు మంజూరు చేయడం జరిగిందని తెలియజేసినారు.
వికారాబాద్ ప్రజల చిరకాల వాంఛ అయిన డిగ్రీ కళాశాలను మంజూరు చేయటం జరిగిందన్నారు. పదవ తరగతి,ఇంటర్ తర్వాత బాలికలు విద్యా ఆపకుండా 33 మహిళ డిగ్రీ కలశాలలు ఏర్పాటు చేసాం అని మంత్రి ఈ సందర్బంగా తెలియజేసినారు.
=======================
DPRO/VKB.

Share This Post