అదనపు పడకల పనులు వేగవంతంగా పూర్తి చేయాలి

అదనపు పడకల పనులు వేగవంతంగా పూర్తి చేయాలి

ప్రచురణార్థం

అదనపు పడకల పనులు వేగవంతంగా పూర్తి చేయాలి

మహబూబాబాద్ జనవరి 7.

అదనపు పడకల నిర్మాణ పనులు నాణ్యతతో వేగవంతంగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.

శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వ హాస్పటల్ లో అదనపు బెడ్స్ నిర్మాణ పనుల పై వైద్యాధికారులు ఇంజనీరింగ్ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 20 వ తేదీ లోపు అదనపు బెడ్స్ నిర్మాణ పనులను పూర్తి చేయాలన్నారు.
మెడికల్ కళాశాల ప్రొఫెసర్లకు కావలసిన సదుపాయాలను ఏర్పాటు చేయవలసి ఉన్నదని అధికారులకు సూచించారు.

సామాగ్రి ఉన్నందున అదనపు కూలీలను ఏర్పాటు చేసుకుని నిర్మాణ పనులను వేగవంతంగా చేపట్టాలన్నారు.

టాయిలెట్స్ విద్యుత్ పనులు చేపట్టవలసి ఉన్నదని అందుకు అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ సమీక్ష సమావేశంలో ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకులు భూక్య వెంకట్ రాములు , ఆర్ ఎం వో వైదేహి టి ఎస్ ఎమ్ ఐ డి సి డిఈ శ్రీనివాస్, పాల్గొన్నారు
—————————————————————
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post