అదనపు బెడ్స్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలి….

ప్రచురణార్ధం

అదనపు బెడ్స్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలి….

మహబూబాబాద్, నవంబర్,16.

అదనపు బెడ్స్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.

మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ పై భాగంలో మెడికల్ కళాశాలకు అనుబంధంగా నిర్మిస్తున్న 300 అదనపు బెడ్స్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ స్వయంగా సందర్శించి పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నాణ్యత తో చేపట్టాలని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఇంజనీరింగ్ అధికారులతో అదనపు బెడ్స్ నిర్మాణ పనులను మ్యాప్ ద్వారా పరిశీలిస్తూ మార్పు చేర్పులు చేపడుతూ పనులను వేగవంతం చేయాలన్నారు.

కలెక్టర్ వెంట జిల్లా ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ పర్యవేక్షకులు భూక్యా వెంకట రాములు, డి.ఈ. సంతోష్ కుమార్ ఉన్నారు.
————————————————————–
జిల్లా పౌరసంబంధాల అధికారి, కార్యాలయం…మహబూబాబాద్ వారిచే జారిచేయనైనది.

Share This Post