అధికారికంగా చాకలి ఐలమ్మ జయంతి నిర్వహణ…. జిల్లా కలెక్టర్ హనుమంతరావు

పత్రికా ప్రకటన
సంగారెడ్డి, సెప్టెంబర్ 23:–

అధికారికంగా చాకలి ఐలమ్మ జయంతి నిర్వహణ…. జిల్లా కలెక్టర్ హనుమంతరావు

ఈ నెల 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాన్ని అధికారికంగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ హనుమంతరావు గురువారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని ప్రభుత్వ ఉత్సవంగా ప్రకటించిందని ఆయన పేర్కొన్నారు. ఆ మేరకు జిల్లాలో ఈ నెల 26న చాకలి ఐలమ్మ జయంతోత్సవంను నిర్వహించనున్నట్లు తెలిపారు.

సంగారెడ్డి లోని సమీకృత కలెక్టరేట్ పక్కన గల వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహానికి 26 న ఉదయం 10:30 గంటలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించనున్నట్లు ఆయన తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో జిల్లా మంత్రి ,పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు ,అన్ని వర్గాల ప్రతినిధులు పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు.

Share This Post