అధికారులు,ఉద్యోగులు అంకిత భావంతో జిల్లా అభివృద్ధి కి కృషి చేయాలి:జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్*

జిల్లాలోని వివిధ శాఖల అధికారులు,ఉద్యోగులు నూతన సంవత్సరంలో అంకిత భావం తో,నూతన ఉత్సాహం తో  పనిచేసి ఉత్తమ ఫలితాలు సాధించాలని, అభివృద్ధిలో నల్గొండ జిల్లా ను అగ్రగామిగా నిలపాలని జిల్లా కలెక్టర్  ప్రశాంత్ జీవన్ పాటిల్ పిలుపునిచ్చారు.జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరం లో  జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ,అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్ లకు సోమవారం వివిధ శాఖల అధికారులు,ఉద్యోగులు,ఉద్యోగ సంఘాల నాయకులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి పురస్కరించుకుని పేద విద్యార్ధులకు ఉపయోగ పడే విధి
గా  పలువురు అధికారులు ఉద్యోగులు బొకే లు,స్వీట్ బాక్స్ లకు బదులు నోట్ పుస్తకాలు,పెన్నులు,పెన్సిల్స్,దుప్పట్లు,అందచేశారు.
ఈ సందర్భంగా అధికారులు ఉద్యోగులకు,ఉద్యోగ సంఘాల నాయకులకు జిల్లా కలెక్టర్  నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కు ఆర్.డి. ఓ.జగదీశ్వర్ రెడ్డి,టి.జి.ఓ.,టి.యన్. జి.ఓ.,రెవెన్యూ,ఎం.పి.డి.ఓ.సంఘం ల అధికారులు, నాయకులు,రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్,జిల్లా అధికారులు నోట్ పుస్తకాలు,పెన్నులు, పెన్సిల్స్,దుప్పట్లు అంద చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

అధికారులు,ఉద్యోగులు అంకిత భావంతో జిల్లా అభివృద్ధి కి కృషి చేయాలి:జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్*

Share This Post