అధికారులు అప్రమత్తంగా ఉండాలి… రాష్ట్ర గిరిజన సంక్షేమం, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్

ప్రచురణార్థం

అధికారులు అప్రమత్తంగా ఉండాలి…

మహబూబాబాద్, జూలై-23:

అధికారులు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర గిరిజన సంక్షేమం, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశించారు.

శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధ్యక్షతన భారీవర్షాలకు తీసుకుంటున్న చర్యలు, హరితహారం కార్యక్రమానికి చేపడుతున్న చర్యలపై సంబంధిత అధికారులతో మంత్రి సమీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కాజువేల వద్ద నీటి ఉధృతి పెరుగుతున్నందున పోలీస్ రెవెన్యూ శాఖలు బారికేడ్స్ఏర్పాటు చేయాలన్నారు.

బయ్యారం మండలం మెట్ల తిమ్మాపురం వ్యవసాయ పనులపై వెళ్ళినవారు రాత్రి వేళలో తిరిగి వస్తూ నలుగురిలో ఒకరు తాటి రవీందర్ ప్రవాహ వేగాన్ని దాటుతూ ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమన్నారు.

అదేవిధంగా భారీవర్షాలకు, నీటిప్రవాహానికి పడిన గుంతలను వెంటనే పూడ్చి వేయాలన్నారు. ప్రమాదకరమైన ప్రాంతాల వద్ద గ్రామస్థాయి సిబ్బందిని నియమించాలని సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రజలను ఎట్టి పరిస్థితులలో వాగులు వంకలను దాటనీయ రాదన్నారు.
మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. నీటిపారుదల శాఖ అధికారులు జిల్లాలోని 737 చెరువులను ఎస్సారెస్పీ నీటి తో నింపు తుండగా ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు ఎస్ ఆర్ ఎస్ పి గేట్లు మూసివేసినట్లు తెలియజేశారు. భారీ వర్షాలకు చెరువులు నిండుతున్నందున ప్రజాప్రతినిధులు, రైతుల సహకారంతో చెరువు కట్టల భద్రత మరింత పెంచాలని, బలహీనంగా ఉన్న చోట ఇసుక బస్తాలను ముందస్తుగా ఏర్పాటు చేసుకోవాలన్నారు.
వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులను వెంటనే చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

హరితహారం పై మాట్లాడుతూ రాష్ట్ర ఐ టి మున్సిపల్ వ్యవహారాల శాఖ మాత్యులు కల్వకుంట్ల తారకరామారావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 24వ తేదీన చేపడుతున్న కోటి వృక్ష అర్చన కార్యక్రమాన్ని భారీగా విజయవంతంగా చేపట్టాలని మంత్రి పిలుపునిచ్చారు అందుకు సరిపడా మొక్కలను అటవీశాఖ సరఫరా చేయాలన్నారు అదేవిధంగా ప్రతి మండలానికి మెగా హరితహారం పేరుతో 10 ఎకరాల్లో మొక్కలు నాట నున్నందున ఈ నెల 24వ తేదీన మొక్కలు నాటేందుకు గాను ప్రారంభోత్సవ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేపట్టాలన్నారు. గతంలో చెట్లు ఉన్నచోట వాటి కింద పూల మొక్కలు నాటాలన్నారు.

విద్యుత్ శాఖ అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. వైద్య శాఖ అధికారులు గ్రామాల్లో పర్యటించాలని సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. సబ్ సెంటర్లలో ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలలో మందులు అందుబాటులో ఉండాలన్నారు 4వ విడత సర్వే చేపడుతున్నామని వైద్య సిబ్బంది ఫీవర్ సర్వే లో పర్యటిస్తున్న ట్లు తెలియజేశారు. 57 మంది గర్భిణీలకు గాను హైరిస్క్ ఉన్న 12 మందిని పీహెచ్సీలకు తరలించడం జరిగింది అన్నారు. పంచాయతీ అధికారులు గ్రామాల్లో పర్యటించి పారిశుద్ధ్యం మెరుగుపరుస్తూ బ్లీచింగ్ చేయించాలన్నారు.

మహబూబాబాద్ శాసనసభ్యులు శంకర్ నాయక్ మాట్లాడుతూ ప్రధానంగా నీటిపారుదల పై ఇంజనీరింగ్ అధికారులు దృష్టి సారించాలన్నారు అదేవిధంగా వైద్య ఆరోగ్యం పై దృష్టి పెట్టాలన్నారు. తండాలు, గూడెం లలో విద్యుత్ కనెక్షన్లు నేరుగా ఇస్తున్నందున ప్రమాదాలు వాటిల్లుతుందని విద్యుత్ అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలు చేపట్టాలన్నారు మీటర్లు ఏర్పాటు చేసేందుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలన్నారు ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకం కల్పించాలని వైద్యులకు సూచించారు 35 కోట్లతో రోడ్ల నిర్మాణాలు చేపట్టామని మరికొన్ని ఐటీడీఏ పరిధిలో కూడా ఉన్నాయని వాటి మరమ్మతులు వెంటనే చేపట్టాలన్నారు చెరువుల పక్క ఉన్న కాలనీలలో ఉన్న ఇల్లు భారీ వర్షాలకు కూలిపోయే దశలో ఉంటాయని అధికారులు పర్యవేక్షించా లన్నారు.

జిల్లా ఎస్పీ కోటి రెడ్డి మాట్లాడుతూ భారీవర్షాల లో టీం వర్క్ గా పనిచేస్తూ ఆస్తి నష్టం ప్రాణ నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు వీఆర్ఏ ల తో వరద ప్రాంతాలలో చర్యలు చేపడుతున్నామన్నారు భీముని పాదం ఏడు బావులు వంటి పర్యాటక ప్రదేశాలు ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా ఆయా ప్రాంతాల లో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఏడు బావులు పర్యాటక ప్రాంతం ప్రమాదకరంగా ఉన్నందున భద్రతా చర్యలు తీసుకోవాలని మంత్రి దృష్టికి తేగా ప్రతిపాదన లు అందించాలని మంత్రి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

ఈ సమీక్ష సమావేశంలో జడ్పీ చైర్మన్ కుమారి బిందు అదనపు కలెక్టర్ కొమరయ్య సంబంధిత జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
————————————————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post