ప్రచురణార్థం…
అధికారులు అప్రమత్తంగా ఉండాలి…
మహబూబాబాద్ సెప్టెంబర్ 6.
భారి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండి నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.
సోమవారం కలెక్టర్ కార్యాలయం నుండి టెలికాన్ఫరెన్స్ తో వర్షాలపై అధికారులతో సమీక్షించారు.
భారీ వర్షాలతో జిల్లాలో అధికారులు తీసుకున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. లోతట్టు ప్రాంతాల్లో, ముంపు ప్రాంతాల్లో, కాజ్ వే ల వద్ద బారికేడ్స్ ఏర్పాటు చేసి సిబ్బందిని అప్రమత్తంగా ఉంచాలన్నారు.
చెరువులు, కుంటల వద్ద గ్రామస్థాయి సిబ్బందిని నియమించాలన్నారు. చేపలు పట్టేందుకు చెరువులో గానీ నదిలో కానీ వెళ్ళనియరాదని తెలిపారు
లోతట్టు ప్రాంతాల్లో, ముంపు ప్రాంతాల్లో, కాజ్ వే ల వద్ద బారికేడ్స్ ఏర్పాటు చేసి సిబ్బందిని అప్రమత్తంగా ఉంచాలన్నారు. చెరువులు, కుంటల వద్ద గ్రామస్థాయి సిబ్బందిని నియమించాలన్నారు.
గ్రామాలలో విస్తృత ప్రచారం చేయించాలని జిల్లా పంచాయతీ అధికారి ని ఆదేశించారు.
జిల్లా ఎస్పీ కోటిరెడ్డి సూచనల మేరకు పాఠశాలల్లో నీరు నిలిచినందున ఆయా పాఠశాలలు తాత్కాలికంగా మూసివేయాలని కలెక్టర్ ఆదేశించారు. డోర్నకల్ పరిధిలో చెరువులు ఎక్కువగా నిండిఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
మరిపెడ మండలం బంధం కుంట చెరువు వద్దభద్రత కల్పించాలన్నారు జిల్లాలోని గుర్తించిన 85 గ్రామాలకు గ్రూపులు ఏర్పాటు చేసి సిబ్బందిని అప్రమత్తం చేయాలన్నారు.
ఈ టెలీ కాన్ఫరెన్స్ లో ఎస్పీ కోటిరెడ్డి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ మరో అదనపు కలెక్టర్ కొమరయ్య తాసిల్దార్ లు పోలీస్ సిబ్బంది పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
———————————
జిల్లా పౌరసంబంధాల అధికారి, మహబూబాబాద్ చే జారిచేయనైనది