అధికారులు అప్రమత్తంగా ఉండాలి కలెక్టర్ బి.గోపి

రాష్ట్రంలో భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ బి.గోపి ఆదేశించారు.

ఆదివారం సాయంత్రం కలెక్టర్ Rdo,ఎంపీడీఓ లు,మండల స్పెషల్ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.

రానున్న మూడు రోజులలో తుఫాను కారణంగా అధిక వర్షాలు కురిసే ప్రమాదం ఉన్నందున అధికారులు ప్రజలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని
కలెక్టర్ టెలీకాన్ఫెరెన్స్ ద్వారా అధికారులను ఆదేశించారు

జిల్లాలో అన్ని చెరువులు దాదాపు పూర్తిగా నిండి ఉన్నందున ప్రజల ఎవరు వాగులను దాటవద్దని,ప్రయాణించినప్పుడు చెట్ల కింద వాహనాలను నిలుప వద్దని కలెక్టర్ సూచించారు.

రెవెన్యూ అధికారులు, పోలీసు సిబ్బంది, రోడ్లు భవనాల శాఖ అధికారులు, పంచాయతీరాజ్ సిబ్బంది విధులలో అప్రమత్తంగా ఉండాలని ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చూడాలని కలెక్టర్ పేర్కొన్నారు.

అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటకు రావద్దని కలెక్టర్ తెలిపారు.

గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అన్నీ శాఖ ల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

శిథిలావస్తలో ఇళ్లలో ఎవరు ఉండొద్దని కలెక్టర్ ప్రజలకు సూచించారు.

Share This Post