అధికారులు అప్రమత్తంగా ఉండాలి…

ప్రచురణార్థం

అధికారులు అప్రమత్తంగా ఉండాలి…

మహబూబాబాద్ సెప్టెంబర్ 28.

భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.

మంగళవారం కలెక్టర్ కార్యాలయం నుండి భారీ వర్షాల పై నీటిపారుదల రోడ్లు భవనాలు పంచాయతీరాజ్ రెవెన్యూ ఎంపీడీవోల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారీ వర్షాలకు చెరువుల వద్ద లో లెవెల్ కాజ్వే లోతట్టు ప్రాంతాల వద్ద సిబ్బందిని సిద్ధంగా ఉంచుతు అధికారులు పర్యవేక్షించాలి అన్నారు.

దంతాలపల్లి పెద్దముప్పారం చిన్నగూడూరు జిన్నల వాగు జంగిల్ కొండ రోడ్డు మహబూబాబాదులో బంధం పల్లి కొత్తగూడ లో రెండు చెరువులు వద్ద సిబ్బందిని ఉంచినట్లు కలెక్టర్ తెలియజేశారు.

అదేవిధంగా గర్భిణీ మహిళలు వారి ప్రసవ తేదీలను పరిగణన లోకి తీసుకొని అంబులెన్స్ ద్వారా వైద్యశాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

నెల్లికుదురు మండలంలో శిథిలావస్థ భవనాల లో నివసిస్తున్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని కలెక్టర్ ఆదేశించారు అలాగే మండలాలలో తాసిల్దార్ లు తడిసిన గోడల ఇండ్లల్లో ఉన్న ప్రజలను కూడా పునరావాస కేంద్రాలకు తరలించా లన్నారు విద్యుత్తు సమస్యలు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు రామన్నగూడెం లో తెగిన విద్యుత్ వైరును తక్షణం తొలగించాలన్నారు బయ్యారం మండలం నుండి ఇల్లందు వెళ్లే రహదారిలో నామాల పాడు వద్ద వరద ఉధృతి ఉన్నందున ప్రజలను రోడ్డు దాటనియరాదని అధికారులను ఆదేశించారు.

ఈ టెలీ కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ కొమరయ్య తొర్రూర్ ఆర్డిఓ రమేష్ ఇంజనీరింగ్ అధికారులు తాసిల్దార్ లు ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు
————————————–
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post