అధికారులు జవాబుదారీతనంగా పని చేయాలి… జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

ప్రచురణార్థం

అధికారులు జవాబుదారీతనంగా పని చేయాలి…

మహబూబాబాద్, జూలై 20.

అధికారులు పారదర్శకం గా జవాబుదారీతనంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు.

మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ కొమరయ్య ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయ వివిధ విభాగాల పర్యవేక్షకులతో కలెక్టర్ ప్రభుత్వ కార్యకలాపాలపై సమగ్రంగా సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు ఉత్తర ప్రత్యుత్తరాలలో పారదర్శకత ఉండాలని జవాబుదారీతనంతో పనిచేయాలన్నారు.

ఈ ఫైలింగ్ విధానం పై మాట్లాడుతూ ఆయా సెక్షన్ల పర్యవేక్షకులు ఈ ఫైలింగ్ విధానం కొనసాగిస్తూ రిజిస్టర్ల లో తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. సీతారామ ఎత్తిపోతల పథకం జాతీయ రహదారుల కొరకు చేపడుతున్న భూసేకరణ వేగవంతం చేయాలన్నారు.

ఆరోగ్యశ్రీ పై తక్షణమే స్పందించాలని, రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం వేగవంతంగా కొనసాగేందుకు చర్యలు తీసుకోవాలని,
తాసిల్దార్ లు గ్రామ సభలు ఏర్పాటు చేసి లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు అట్రాసిటీ, పీడీ యాక్ట్ లపై స్పందిస్తూ కల్యాణలక్ష్మి వంటి పథకాలపై అశ్రద్ధ తగదన్నారు. ప్రభుత్వ భూములను పరిరక్షించాలన్నారు. భూ రికార్డులను భద్రపరచాలన్నారు.
కార్యాలయ పనులు వేగవంతంగా జరగాలని జవాబుదారీతనంతో పనిచేయాలన్నారు.

ఈ సమావేశంలో కలెక్టరేట్ పరిపాలనాధికారి వెంకటరమణ వివిధ సెక్షన్ల పర్యవేక్షకులు సంజీవ్, పున్నం చందర్, ఫణి కిషోర్, రామకృష్ణ, అనురాధ భాయి పాల్గొన్నారు.
—————————————————————————-
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post