అధికారులు జవాబుదారీతనంతో పని చేయాలి…

ప్రచురణార్థం

అధికారులు జవాబుదారీతనంతో పని చేయాలి…

మహబూబాబాద్ సెప్టెంబర్,13.

అధికారులు జవాబుదారీతనంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.

సోమవారం గ్రీవెన్స్ డే పురస్కరించుకొని ప్రగతి మీటింగ్ హాల్లో నిర్వహించిన ప్రజావాణిలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ రెవెన్యూ అదనపు కలెక్టర్ కొమరయ్య లతో పాల్గొని పలువురి దరఖాస్తులు ఫిర్యాదులు స్వీకరించారు.

గార్ల మండలం బియ్యారం తండా కు చెందిన భానోత్ కవిత తన దరఖాస్తును అందిస్తూ తాను పోలికలతో దివ్యాంగురాలు కూలీ పనులు కూడా సరిగా చేసుకోలేకపోతున్నా నని పింఛన్ మంజూరు చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు.

మహబూబాబాద్ మండలం గాంధీ పురం కు చెందిన గుండమాల రాములు తన చెల్లెలు గుండమాల సుక్లు దివ్యాంగురాలు అని వేలి ముద్ర ఇబ్బందితో రేషన్ బియ్యం ఇవ్వడం లేదని విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు.

కొత్తగూడ మండలం ఓటాయి గ్రామ పరిధిలోని రేనియ తండాకు చెందిన బోడ అభిరామ్ తన దరఖాస్తు ఇస్తూ తనకు క్యాన్సర్ తో ఒక కన్ను కోల్పోయానని దాని ప్రభావం మరో కంటి పై కూడా పడింది చూపు మందగించిందని తాను దివ్యాంగుడు కావడంతో పింఛన్ మంజూరు చేయాలని వేడుకున్నారు.

గార్ల మండలం మర్రిగూడెం పంచాయతీ పరిధిలోని చిన్న సరిహద్దు తండాకు చెందిన తేజావత్ దరఖాస్తు అందిస్తూ తనకు ఐదు ఎకరాల 14 గంటల అసైన్డ్ భూమి ఉన్నదని తన భర్త చనిపోవడంతో తన బంధువులు ఆక్రమించినందున తనకు న్యాయం చేకూర్చాలని కోరారు.

తొర్రూరు మండలం హరిపిరాల కు చెందిన అంగన్వాడీ టీచర్ దాసరి ఇందిరమ్మ పై పోలీస్ కేసు ఉన్నదని ఎఫ్ఐఆర్ కూడా నమోదైందని చర్యలు తీసుకోవాల్సిందిగా జి ఎల్లమ్మ తన దరఖాస్తును అందజేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వారంలోగా సమస్యలకు పరిష్కారం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

గ్రీవెన్స్ డే లో జడ్పీ సీఈఓ రమాదేవి డిఆర్డిఎ పిడి సన్యా సయ్య కార్యాలయ పరిపాలన అధికారి వెంకటరమణ జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
——————————————————–
జిల్లా పౌరసంబంధాల అధికారి మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post