అధికారులు తప్పనిసరిగా ఖాది వస్త్రాలు ధరించాలి…

ప్రచురణార్థం

అధికారులు తప్పనిసరిగా ఖాది వస్త్రాలు ధరించాలి…

మహబూబాబాద్ సెప్టెంబర్ 13.

అధికారులు ప్రతి సోమవారం ఖాదీ వస్త్రాలు ధరించాలని జిల్లా కలెక్టర్ శశాంక సూచించారు.

సోమవారం ప్రగతి సమావేశ మందిరంలో అధికారులతో గ్రీవెన్స్ పై కలెక్టర్ సమీక్షించారు.

జిల్లా అధికారులు ప్రతి సోమవారం తప్పనిసరిగా ఖాదీ వస్త్రాలు ధరించాలని జిల్లా కలెక్టర్ శశాంక సూచించారు.

ఖాది వస్త్రాలపై ప్రభుత్వ పరంగా ప్రచారం కూడా అవసరమన్నారు ప్రతి ఒక్కరిలో ఖాదీ వస్త్రాలు ధరించాలన్న ఆలోచన కూడా కలిగించవచ్చునని అన్నారు. తద్వారా నేత కార్మికులకు ఉపాధి పెరుగుతుందని లబ్ధి చేకూరుతుందని అటువంటి సంకేతాలను శరవేగంగా తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.

అధికారులు సమావేశాలు కార్యక్రమాలు వీడియో కాన్ఫరెన్స్ లకు సకాలంలో హాజరు కావాలని అలా కాని పక్షంలో సమస్యను ముందుగా తెలియ జేస్తూ తమ క్రింది స్థాయి వ్యక్తులను సమావేశానికి తగిన నివేదికలతో అవగాహన పరచి పంపించాలన్నారు.

కార్యాలయ ఉత్తరప్రత్యుత్తరాలు ఈ ఆఫీస్ ద్వారా పంపించాలని, ఆ ఫైల్స్ తాలూకు నెంబర్లను తనకు వాట్సాప్ ద్వారా పంపించాలన్నారు.

జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలపై రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమశేఖర శర్మ దృష్టి పెట్టారని మండల స్థాయిలో పౌష్టికాహారం విద్య వైద్యం విద్యుత్ వ్యవసాయం శానిటేషన్ స్కిల్ డెవలప్మెంట్ తదితర 81 అంశాలపై అభివృద్ధి నివేదికలను ఎప్పటికప్పుడు అందజేస్తూ ఉత్తమ రేటింగ్ పొందవలసిందిగా అధికారులకు సూచించారు. అందులో వైద్య శాఖకు సంబంధించి 49 అంశాలు ఉన్నాయని అన్నారు . మిగతా అంశాలు వివిధ శాఖలకు చెందిన ఉన్నాయన్నారు ప్రతి నెల పదవ తారీకు నుండి 12 వ తారీకు లోపు అందజేయాలని నివేదికలను పునః పరిశీలించి 15వ తారీఖు వరకు ప్రభుత్వానికి సమర్పించడం జరుగుతుందన్నారు. అధికారులు పంపే నివేదికలు సాఫ్ట్ కాపీ హార్డ్ కాపీ ల రూపంలో ఉండాలన్నారు. అధికారులు పారదర్శకంగా జవాబుదారీతనంతో పనిచేస్తూ ఉత్తమ అధికారులుగా పేరు తెచ్చుకోవాలన్నారు.

ఈ సమీక్ష సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష్ అభినవ్ రెవెన్యూ అదనపు కలెక్టర్ కొమరయ్య జిల్లా అధికారులు ప్రజలు పాల్గొన్నారు

జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post