అధికారులు నిరంతరంగా కృషి చేస్తే ప్రజల్లో మార్పు వస్తుంది…. పంచాయతీ రాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా

 

భవిష్యత్ తరాలను కాపాడాల్సిన బాధ్యత అందరిదీ

ఆరోగ్యకర సమాజాన్ని ,స్వచ్ఛ వాతావరణాన్ని అందించాలి

అధికారులు నిరంతరంగా కృషి చేస్తే ప్రజల్లో మార్పు వస్తుంది…. పంచాయతీ రాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా

భవిష్యత్ తరాలకు ఆరోగ్యకర స్వచ్ఛ వాతావరణ సమాజాన్ని అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పంచాయతీ రాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా పేర్కొన్నారు.

బుధవారం ఆయన సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం కోనాపూర్ గ్రామాన్ని సందర్శించారు. అదనపు కలెక్టర్ రాజర్షి షా, సంబంధిత అధికారులతో కలిసి పల్లె ప్రగతి పనులు, పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డ్, వైకుంఠధామం, పారిశుద్ధ్య నిర్వహణ తదితరాలను పరిశీలించారు. అనంతరం గ్రామ సభలో పాల్గొన్నారు.

ఆత్మకూర్ పి హెచ్ సి పరిధిలో, కోనాపూర్ గ్రామం లో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తయినందున పిహెచ్సి డాక్టర్ ప్రవీణ్ కుమార్ ను, కోనాపూర్ సర్పంచ్ , ఏ ఎన్ ఎం , తదితరులను అభినందించి సన్మానించారు.

అనంతరం సంగారెడ్డి కలెక్టరేట్లో ఎంపీడీవోలు, డి ఎల్ పి వో లు, ఎం పీ ఓ లు ,ఏ పీ ఎం లతో పల్లె ప్రగతి కార్యక్రమం పై సమీక్షా సమావేశం నిర్వహించి, దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపకల్పన చేశారన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం ఉద్దేశాన్ని సంపూర్ణంగా తెలుసుకుని, ఆ దిశగా పని చేస్తే కార్యక్రమ ఉద్దేశం సఫలీకృతం అవుతుందన్నారు.

ప్రభుత్వం ప్రజలకు అన్ని విధాల ఆరోగ్యకరమైన జీవితాన్ని అందించడానికి పంచాయతీలకు అవసరమైన వసతులను కల్పిస్తుందన్నారు. వైకుంఠ దామాలు, డంపింగ్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, రక్షిత తాగునీరు, ట్రాక్టర్ ,ట్రాలీ, ట్యాంకర్ తదితర వసతులను సద్వినియోగం చేసుకోవాలన్నారు . అదేవిధంగా గ్రామ పారిశుద్ధ్య నిర్వహణ నిరంతర ప్రక్రియగా కొనసాగాలని, సిగ్రిగేషన్ షెడ్లలో సెగ్రి గేషన్ జరిగి ఎరువు తయారు కావాలన్నారు.

ప్రజల్లో మార్పుకు నిరంతరంగా ప్రయత్నించాలన్నారు. ఒక పని చేస్తున్నామంటే అది ఎందుకు చేస్తున్నామన్నది గుర్తించి ఆ దిశగా లక్ష్యాన్ని నెరవేర్చినపుడే ఉద్దేశ్యం నెరవేరుతుందన్నారు. చేసే పనులను లెక్క పెట్టాలన్నారు. అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు.

ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని, క్షేత్ర పరిధిలో సమస్యలను గుర్తించాలన్నారు.
ప్రజలు చెప్పేది వినాలని, ప్రజల ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి అధికారులు నిరంతరంగా కృషి చేస్తే ప్రజల్లో మార్పు వస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు అందించే సేవలు, పనులతో సంతృప్తి లభిస్తుందని, అదే విధంగా ప్రజల నుండి గౌరవం దక్కుతుందన్నారు.

రాష్ట్రంలో ప్రప్రధమంగా వైకుం
దా మాలను పూర్తి చేసిన జిల్లా సంగారెడ్డి జిల్లా అని, అందుకు పట్టుదలతో పనిచేసిన అధికారులందరినీ ఆయన ఈ సందర్భంగా అభినందించారు. అదే స్ఫూర్తితో మనసు పెట్టి పని చేసి ఫలితాలు సాధించాలన్నారు.

జిల్లా కలెక్టర్ హనుమంతరావు
జిల్లాలో పల్లె ప్రగతి కార్యక్రమాలు, ఈజీఎస్ పనులు, అవెన్యూ ప్లాంటేషన్, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, హరిత హారంలో నాటిన మొక్కలు, sigri గేషన్, ఎరువు తయారీ, తదితర అంశాల పురోగతిపై వివరించారు.

అనంతరం సందీప్ కుమార్ సుల్తానియా జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయాన్ని సందర్శించారు. జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి ఆయనను సన్మానించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ రాజర్షి షా, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డి ఆర్ డి ఓ శ్రీనివాస రావు, డిపిఓ సురేష్ మోహన్, ఏపీ డి లు, జడ్పీ డిప్యూటీ సీఈఓ, తదితరులు పాల్గొన్నారు.

Share This Post