అధికారులు పని తీరు మార్చుకోవాలి…

ప్రచురణార్థం

అధికారులు పని తీరు మార్చుకోవాలి…

గార్ల,
మహబూబాబాద్ సెప్టెంబర్,07.

అధికారులు పనితీరు మార్చుకోవాలని జిల్లా కలెక్టర్ శశాంక హెచ్చరించారు.

మంగళవారం భారీ వర్షాల ఈ నేపథ్యంలో గార్ల మండలం లోని రాంపురం వద్ద మున్నేరు నది పై ఉన్న కాజ్ వే మునగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడగా ఐటీడీఏ పీవో గౌతమ్ తో పర్యటించి సందర్శించి పరిశీలించారు. బారికేడ్స్ ఏర్పాటు చేసి భద్రత చర్యలు తీసుకోవాలన్నారు. వరద పూర్తిగా తగ్గుముఖం పట్టే వరకు ఎవరిని నదిని దాటనియరాదని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.

గార్ల మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి నిర్వహణ తీరును పరిశీలించారు. పాఠశాల ఆవరణలో నీరు నిల్వ ఉండకుండా మట్టి పోయించాలన్నారు.
విద్యార్థుల హాజరు శాతం తక్కువగా నమోదు కావడం కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థులతో మాట్లాడుతూ తోటి విద్యార్థులను పాఠశాలకు వచ్చే విధంగా ప్రోత్సహించాలన్నారు కోవిద్ పేరుతో విద్యను కోల్పో రాదని సూచించారు.
చిన్నతనం నుండే ఉన్నత విద్యపై లక్ష్యం ఏర్పరచుకోవాలని ఉద్భోదించారు .

తాసిల్దార్ కార్యాలయం నిర్వహణ తీరును పరిశీలిస్తూ నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను సందర్శించి పరిశీలించారు అపరిశుభ్రంగా ఉండటంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ హాస్పిటల్లో నిర్వహణ తీరును సరిచేసుకోవాలని డాక్టర్ల పర్యవేక్షణ కొరవడినట్లు గ్రహిస్తూ వారం రోజుల్లోగా అధికారుల తీరు మార్చుకోవాలని హెచ్చరించారు.

కలెక్టర్ వెంట మండల ప్రత్యేక అధికారి నరసింహమూర్తి జడ్పిటిసి ఝాన్సీ తాసిల్దార్ స్వాతి బిందు ఎంపీడీవో రవీందర్ సర్పంచ్ బన్సీలాల్ డాక్టర్ లు రానా ప్రతాప్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
—————————————————————–
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post