అధికారులు ప్రజల సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు.

అధికారులు ప్రజల సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు.  సోమవార కలెక్టరేట్ ప్రజావాణి హాల్లొఅదనపు కలెక్టర్.  , పద్మజా రాణి తో కలిసి ప్రజల నుండి ప్రజావాణి ఫిర్యాదులను స్వీకరించారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణిలో దరఖాస్తు చేస్తే సమస్య త్వరగా పరిష్కారం అవుతుందనే నమ్మకంతో ప్రజలు ప్రజావాణికి వచ్చి తమ సమస్యలను ఫిర్యాదు రూపంలో ఇస్తారని వాటిని సంబంధిత జిల్లా అధికారులు సత్వరమే స్పందించి పరిష్కారం చేయాలని ఆదేశించారు.  పరిష్కారం చేయలేని అంశాలు ఉంటే ఫిర్యాదుదారులకు అక్కడే అవగాహన కల్పించాలన్నారు.  మరికొన్ని పై అధికారులకు పంపించాల్సి ఉంటే ఫిర్యాదులను పంపిస్తూ అట్టి కాపీ ని ఫిర్యాదు దారునికి సైతం పంపించాలన్నారు.  ఓకే సమస్యతో ఫిర్యాదు దారుడు ఫిర్యాదు తీసుకొని పలుమార్లు వచ్చే దుస్థితి ఉండకూడదని సూచించారు.  ప్రజావాణి ఫిర్యాదులకు అధికారులు తొలి ప్రాధాన్యం ఇచ్చి వారి నమ్మకాన్ని నిలబెట్టాలని ఆదేశించారు.  ఈ రోజు ప్రజావాణి ద్వారా మొత్తం 18 ఫిర్యాదులు వచ్చాయని వాటి పరిష్కారానికి  సంబంధిత శాఖలకు  పంపిస్తున్నట్లు తెలియజేసారు.  త్వరగా పరిష్కరించకుండా పెండింగ్ లో పెడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Share This Post