అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంగా పనిచేస్తేనే జిల్లా అభివృద్ధి సాధ్యమవుతుంది. జిల్లా జెడ్పి చైర్ పర్సన్ -గండ్ర జ్యోతి.

మంగళవారం వరంగల్ రూరల్ జడ్పీ సమావేశ మందిరంలో జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది .

ఈ సందర్బంగా జెడ్పి చైర్ పర్సన్ మాట్లాడుతూ జిల్లాలోని జెడ్పీటీసీలు,ఎంపీపీలు అధికారులందరూ సమన్వయంతో పని చేస్తేనే జిల్లా అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.

వ్యవసాయం, గ్రామీణ అభివృద్ధి, వైద్యం, శానిటేషన్, ప్రధాన ఎజెండాగా సుదీర్ఘంగా సమావేశం జరిగింది.

జిల్లా పంచాయతీ అధికారి గ్రామాలలో పర్యటించాలని…మండలాలలో జరిగే అన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు జెడ్పిటిసి ,ఎంపీపీ లను కూడా భాగస్వామ్యం చేయాలని జెడ్పి చైర్ పర్సన్ తెలిపారు.

జిల్లాలో రైతులకు ఉద్యాన పంటలపై అవగాహన కల్పించాలని, పామాయిల్ తోటల పెంపకానికి రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించాలని, పామాయిల్ తోటల పెంపకానికి జిల్లాలో రైతులు ఉత్సాహంగా ఉన్నారని జడ్పీ చైర్పర్సన్ తెలిపారు.
గౌరవ సభ్యులు తమ సమస్యలను సభలో తెలిపారని అధికారులు వాటిపై తగు చర్యలు తీసుకోవాలని అన్నారు.

రాబోయే సిజన్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద సిబ్బందిని పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలని అన్నారు .

ఈ సమావేశం యొక్క మినిట్స్ గౌరవ సభ్యులకు అందరికీ అందజేస్తామని జెడ్పి చైర్ పర్సన్ తెలిపారు.

దళిత బందు పథకాన్ని అభినందిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని చైర్ పర్సన్ సభలో ఆమోదం తెలిపారు.

జిల్లా కలెక్టర్ హరిత మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాతకంగా చేపట్టే పథకాలను క్షేత్ర స్థాయి వరకు తీసుకెళ్ళాలిసిన బాధ్యత అందరి మీద ఉందన్నారు.
జడ్పీటీసీ, ఎంపీపీ లు తెలియచేసి న సమస్యలను వెంటనే అధికారులు పర్యవేక్షించి తగు చర్యలు తీసుకోవాలన్నారు.

ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ప్రతీ గ్రామాన్ని అభివృద్ధి పరిచేందుకు అధికారులు కృషి చేయాలన్నారు.

నర్సంపేట శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్య మంత్రి కె .చంద్రశేఖర్ రావు ఆయిల్ ఫామ్ పంట సాగు విస్తీర్ణం పెంచడం పైన ఎంతో శ్రద్ద చూపుతున్నారని… ఇందుకు తగ్గట్టు గా క్షేత్ర స్థాయిలో హార్టికల్చర్ అధికారుల ను నియమించి రైతులకు అవగాహన కల్పించాలన్నారు .

పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి హరితహారం కార్యక్రమాల పురోగతి మరియు గ్రామాలలోని అంతర్గత రోడ్ల నిర్మాణం పనులు త్వరగతిన పూర్తి చేయాలన్నారు.

జిల్లాలోని మంగళ వారి పేట తదితర గ్రామాలలో గత వంద సంవత్సరాలుగా సాగుచేసుకుంటున్న గిరిజన రైతులను నోటీసులు ఇచ్చారని… ఫారెస్ట్ అధికారులు గిరిజన రైతుల పట్ల వ్యవహరిస్తున్న తీరు బాగాలేదని ఎమ్మెల్యే తెలియజేశారు.

పలు శాఖలకు చెందిన పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే అన్నారు.

ఎస్సారెస్పీ హద్దులు ఏర్పాటు చేసి కెనాల్ పరిధిలోని భూములు సాగు చేసుకుంటున్న రైతులకు కొందరికి రైతుబంధు పథకం రాలేదని, దీనిపై రెవెన్యూ అధికారులు స్పందించి రైతులకు రైతు బంధు అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది సప్న మాట్లాడుతూ పంచాయతీ సెక్రెటరీ పని భారాన్ని తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

గీసుకొండ ఎంపీపీ సదరం సర్టిఫికెట్ సకాలంలో వికలాంగులకు అందడం లేదని దానివల్ల వారు పెన్షన్ పొందలేకపోతున్నారని అధికారుల దృష్టికి తీసుకు వచ్చారు.

మండలాలలో కూడా ప్రజావాణి కార్యక్రమం నిర్వహించాలని సభ్యులు జిల్లా కలెక్టర్ దృష్టికి తెలుపగా కలేక్టర్ యం.హరిత మాట్లాడుతూ మండల కేంద్రాలలో ఎంపీడీవోలు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించే విధంగా జెడ్పీ సీఈవో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అధికారులు గౌరవ సభ్యులు తెలిపిన సమస్యలపై చర్యలు తీసుకోవాలని సభ్యులు కోరిన సమాచారాన్ని సకాలంలో అధికారులు అందించాలని కలెక్టర్ ఈ సందర్భంగా కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ హరి సింగ్ , జెడ్ పి సి ఈ ఓ రాజారావు, మరియు అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Share This Post