అధికారులు , ప్రజా ప్రతినిధులు సమన్వయంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలను ప్రజలకు అందించి వారి అభివృద్ధికి తోడ్పడాలి- చేవెళ్ల నియోజకవర్గ పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డి

అధికారులు , ప్రజా ప్రతినిధులు సమన్వయంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
అందించే పథకాలను ప్రజలకు అందించి వారి అభివృద్ధికి తోడ్పడాలని చేవెళ్ల
నియోజకవర్గ పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డి తెలిపారు .
శుక్రవారం జిల్లా కలెక్టరేట్ లోని కోర్ట్ హాలు నుండి చేవెళ్ల నియోజకవర్గ
పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డి అధ్యక్షతన  జూమ్ సమావేశం ద్వారా
మేయర్లు,  మున్సిపల్ ఛైర్ పర్సన్ లు,  ఎం పీ పీ లు , సర్పంచులు ,
కమిషనర్లు , వివిధ శాఖల జిల్లా అధికారులతో జిల్లా అభివృద్ధి  సమన్వయ
మరియు పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా చేవెళ్ల ఎం పీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాకు
అన్ని సదుపాయాలు , సౌకర్యాలు,  వనరులు ఉన్నందున జిల్లాను అన్ని రంగాలలో
ప్రథమ స్థానంలో ఉంచాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులతో
మున్సిపాలిటీలలో, గ్రామా పంచాయతీలలలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
రంగారెడ్డి జిల్లా 78 శాతం  అక్షరాస్యతను కలిగి ఉందని దానిని 97 శాతానికి
పెంచాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. మరుగు దొడ్లు లేని
పాఠశాలలను గుర్తించి  వెంటనే మరుగు దొడ్లను ఏర్పాటు చేయాలని  సూచించారు.
విద్యార్థులకు అందించే మధ్యాహన భోజనం నాణ్యతతో కూడిన పోషక విలువలు ఉన్న
భోజనాన్ని అందించాలని తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు  కోవిడ్
వ్యాక్సిన్  ను వేయాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు. వర్షాలకు
రోడ్లు దెబ్బ తిన్నందున  వెంటనే మరమ్మతులు చేపట్టాలని రోడ్లు భవనాల శాఖ
అధికారులను  ఆదేశించారు. ఆసరా పెన్షన్లకు నూతనంగా దరఖాస్తు చేసుకున్న
అర్హులైన లబ్దిదారులకు ఆసరా పెన్షన్లను త్వరలో అందజేస్తామని గ్రామీణ
అభివృద్ధి  శాఖ అధికారి తెలిపారు. గ్రామ పంచాయతీల్లో రెండు వేల  జనాభా
దాటితే కమ్యూనిటీ మరుగుదొడ్లను నిర్మిస్తున్నామని తెలిపారు. రంగారెడ్డి
జిల్లా రాష్ట్ర రాజధానికి సమీపాన ఉన్నందున కూరగాయలకు మంచి డిమాండ్ ,
మార్కెట్ ఉందని అందువలన   వరి కి ప్రత్యామ్న్యాయంగా రైతులు కూరగాయలు
పండించే విధంగా రైతు వేదికల ద్వారా రైతులకు అవహగాహన కల్పించాలని జిల్లా
వ్యవసాయ శాఖ అధికారిని ఆదేశించారు. పల్లె ప్రగతి,  పట్టణ  ప్రగతుల్లో
తెలిపిన విధంగా తుప్పు పట్టిన , వంగిన , విరిగిన కరెంట్ పోల్ లను
తొలగించి నూతన పోల్స్ లను ఏర్పాటు చేయాలనీ , వేలాడే వైర్లను సరిచేయాలని
విద్యుత్ అధికారులను ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల్లో  పూర్తి  స్థాయి
సిబ్బందిని నియమించుకోవాలని , గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, చిన్న
పిల్లలకు పౌష్ఠిక ఆహారాన్ని అందించాలని, రక్త హీనతను అధిగమించేలా చర్యలు
తీసుకోవాలని జిల్లా సంక్షేమాధికారిని ఆదేశించారు. పాఠశాలల్లో మధ్యాహన
భోజనానికి  వండే  వంటను కట్టెలతో కాకుండా గ్యాస్ ను అందించే విధంగా
చర్యలు చేపట్టాలని సివిల్ సప్లై అధికారులకు సూచించారు. యువతకు ఉపాధి
కల్పించే దిశగా జాబ్  మేళాలను నిర్వహించి ఉద్యోగాలు కల్పించాలని ఉపాధి
కల్పనాధికారిని ఆదేశించారు. జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను
ప్రోత్సహించాలని పరిశ్రమల శాఖ అధికారికి సూచించారు. ఇంకుడు గుంతలు ,
వర్షాల వాళ్ళ భూగర్భ జలాలు బాగా పెరిగాయని , కొత్తగా నిర్మించే భవనాలకు ,
పాఠశాలల్లో ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని సూచించారు. జిల్లాలోని అన్ని
శాఖలు సమన్వయంతో కలిసి పనిచేసి రంగారెడ్డి జిల్లాను అభివృద్ధి పథంలో
వుంచాల్సిన బాధ్యత అధికారులపై వుందని అన్నారు.
ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ , శేరిలింగంపల్లి శాసనసభ్యులు వారికే
పూడి గాంధీ ,  జిల్లా కలెక్టర్ ఆమోయ్ కుమార్, అడిషనల్ కలెక్టర్(లోకల్ బాడీస్)ప్రతిక్ జైన్  , జిల్లా అధికారులు తదితలురు పాల్గొన్నారు

.

Share This Post