అధికారులు శ్రీ సమ్మక్క సారలమ్మ మినీ జాతర పనుల్లో నిమగ్నమవ్వాలని, నిరంతర పర్యవేక్షణతో ఏర్పాట్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని  జిల్లా కలెక్టర్ రాజివ్ గాంధీ హనుమంతు అన్నారు.

బుధవారం నాడు కలెక్టరేట్ సమావేశ మందిరంలో పరకాల శాసన సభ్యులు చల్ల ధర్మారెడ్డి తో కలసి ఆత్మకూరు మండలంలోని అగ్రమ్ పాడు లో జరుగనున్న   శ్రీ సమ్మక్క సారలమ్మ మినీ జాతర పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ
పారిశుద్ధ్యం అతిముఖ్యమని, తాత్కాలిక టాయిలెట్ల నిర్మాణాలు పూర్తి చేయాలని, ఎస్సార్ ఎస్పీ కెనాల్ వద్ద  ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా స్విమ్మర్స్ లను అందుబాటులో పెట్టాలన్నారు.  భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఎక్కువ దూరం నడవకుండ వీలుగా   ఆర్టీసీ బస్సులు  పార్కింగ్ చేయుటకు స్థలాలు సిద్దం చేయాలన్నారు.  జాతరలో అంతరాయం లేని నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని, ప్రాంగణం అంతా సరిపడు వెలుతురు ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.   సమాచార కేంద్రం ఏర్పాటు చేయాలని, తప్పిపోయిన పిల్లలు ఇతరత్రా సేవలకుగాను సమాచారం అందించాలని అన్నారు. వైద్య శిబిరాలు ఏర్పాటుచేయాలని, అన్ని మందులు, అత్యవసర మైనవన్నీ ఇండెంట్ చేసి, అందుబాటులో ఉంచాలన్నారు.  క్యూ లైన్ లు ఏర్పాటు చేయాలన్నారు. కోవిడ్ నిబంధనలు పాటించాలని అన్నారు.
ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా రోడ్డు మరమ్మతులు, పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని అధికారులు సమన్వయంతో అన్ని పనులు ఫిబ్రవరి1 వ తేదీ లోగా పూర్తి  చేయాలని సూచించారు. అధికారులు క్షేత్ర స్థాయిలో వుంటూ, పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని అన్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా జాతరను సమిష్టి కృషితో విజయవంతం చేయాలని అన్నారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్డీఓ శ్రీనివాస్ కుమార్, ఆర్డీవో వాసుచంద్ర,అడిషనల్ కమిషనర్ విరస్వామి,డియం అండ్ హెచ్ ఓ లలితాదేవి,  డిపిఓ జగదీశ్వర్, ఆర్టీసి డియం మోహన్ రావు, ఇతర ఉన్నత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post