అధికారులు సమన్వయంతో పనిచేయాలి…

ప్రచురణార్థం

అధికారులు సమన్వయంతో పనిచేయాలి…

మహబూబాబాద్ నవంబర్ 3.

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫారెస్ట్ భూములపై దరఖాస్తులు స్వీకరిస్తున్నందున అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు

బుధవారం కలెక్టర్ కార్యాలయంలో అటవీ భూములలో వ్యవసాయం చేస్తున్న రైతులనుండి ఈనెల 8వ తేదీ నుండి దరఖాస్తులు స్వీకరిస్తునందున రెవెన్యూ, పోలీస్, అటవీ శాఖ అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 9 మండలాల్లోని 160 గ్రామ పంచాయతీల్లోని 373 హ్యాబిటేషన్లు లో అటవీప్రాంతం ఉందన్నారు.

అటవీ భూముల్లో వ్యవసాయం చేస్తున్న గిరిజన రైతులు తగిన ఆధారాలతో ఈనెల 8వ తేదీ నుండి దరఖాస్తు చేసుకుంటున్నందున రైతులకు నమ్మకం కలిగించేలా శాశ్వత పరిష్కారం చూపేలా ప్రభుత్వ నిబంధనలు తెలియజేయాలన్నారు.

అధికారులు మండల స్థాయిలో సమన్వయం పెంచుకోవాలని సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేయాలన్నారు .

బయ్యారం, కొత్తగూడ, గూడూరు తదితర మండలాల్లో చట్టం గురించి రైతులకు తెలియజేయాలన్నారు.
వ్యవసాయ శాఖ, విద్యుత్ శాఖ అధికారుల సహకారం కూడా తీసుకోవాలన్నారు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారమే దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందన్నారు.

అటవీ భూముల్లో విద్యుత్ తీగలు, ఫెన్సింగ్ లను తొలగించాలన్నారు.

అటవీ భూములు, రెవెన్యూ భూముల బౌండరీలను కూడా వేగవంతం గా చేపట్టాలన్నారు.

దరఖాస్తుల స్వీకరణ కొరకు టీమ్ ల ఏర్పాటు పై కలెక్టర్ సమీక్షించారు.ఫారెస్ట్ భూములలో సాగుచేస్తున్న రైతుల నుండి దరఖాస్తుల పరిశీలనకు టీమ్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని తాసిల్దార్ లను ఆదేశించారు.

ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ కోటిరెడ్డి, డి.ఎఫ్.ఓ. రవికిరణ్, అదనపు కలెక్టర్ కొమరయ్య , ఎఫ్.డి.ఓ. కృష్ణమాచారి, డి.ఎస్పీ లు సైదయ్య, వెంకటరమణ, జిల్లా అధికారులు,ఫారెస్ట్ ,రెవిన్యూ ,పోలీస్ ఎంపిడిఓ అధికారులు పాల్గొన్నారు.
———————
జిల్లా పౌరసంబంధాల అధికారి, కార్యాలయం…మహబూబాబాద్ వారిచే జారిచేయనైనది.

Share This Post