అధికార యంత్రాంగం అప్రతమత్తంగా ఉంటూ రక్షణ చర్యలు చేపట్టాలి : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌

భారీ వర్షాలు కురున్తున్నందున అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంటూ ప్రజల రక్షణ కోనం అవనరమైన చర్యలు తీనుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ (ప్రధాన కార్యదర్శి సోమేళ్‌కుమార్‌ అన్నారు. సోమవారం హైదరాబాద్‌ నుండి డి.జి.పి. మహేందర్‌రెడ్డితో కలిని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, కమీషనర్‌ ఆఫ్‌ పోలీన్‌, నూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీను, నీటిపారుదల శాఖ ఇంజనీర్లతో నమీక్ష నమావేశం నిర్వహించారు. ఈ నందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ భారీ వర్షాలు కురున్తున్నందున జిల్లాలలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను ఎప్పటిప్పుడు అప్రమత్తం చేయాలని, నీటి పారుదల, విద్యుత్‌ శాఖ అధికారులు పరిస్థితులను ఎప్పటికప్పడు పర్యవేక్షించాలని, గత రెండు మూడు రోజుల నుండి కురున్తున్న వర్షాల వలన ఎటువంటి ప్రాణ నష్టం, ఆన్తి నష్టం జరగకుండా అధికారులందరూ అవనరమైన రక్షణ చర్యలు చేపట్టాలని, , క్షేతస్థాయి అధికారులు, ఉద్యోగులు హెడ్‌క్వాటర్స్‌లోనే ఉంటూ పరిన్థితులను నిశితంగా పరిశీలిన్తూ అవనరమైన చర్యలు తీనుకోవాలని తెలిపారు. మంగళవారం కృష్ణాష్టమి నందర్భంగా ప్రభుత్వ సెలవు ఉన్నా కూడా అధికారులందరూ తమ హెడ్‌క్వార్టర్స్‌ లోనే ఉండి పరిస్థితులను పర్యవేక్షించాలని, చేపలు పట్టకుండా అవనరమైన బందోబన్లు చర్యలు తీనుకోవడంతో పాటు ప్రమాద ప్రాంతాలకు ఎవరినీ వెళ్లనీయకుండా పోలీను, రెవెన్యూ యంత్రాంగం కఠినంగా నిరోధించాలని నూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ మాట్లాడుతూ జిల్లాలోని అడ, వట్టివాగు ప్రాజెక్టులతో పాటు చెరువులు కుంటల వద్దకు ఎవరు వెళ్ళకుండా రెవెన్యూ, పోలీను, నీటిపారుదల శాఖల అధికారులు చర్యలు తీనుకోవడం జరుగుతుందని, అత్యవనర పరిస్థితుల్లో ప్రభుత్వ సెలవు దినం అయినప్పటికీ అధికారులు, నిబ్బంది అందుబాటులో ఉంచుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీనుకోవడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు వరుణ్‌రెడ్డి, రాజేశం, జిల్లా ఇన్‌చార్జ్‌ ఎన్‌.పి. నుధీంద్ర, జిల్లా వైద్య,
ఆరోగ్యశాఖ అధికారి మనోహర్‌, నీటిపారుదల శాఖ ఈ.ఈ., రోడ్డు-భవనాల శాఖ ఈ.ఈ., పంచాయతీరాజ్‌ ఈ.ఈ.,
నంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post