అధిక ఆదాయం కల గ్రామ పంచాయతీల్లో చేపట్టిన అభివృద్ధి పనుల్లో వేగం పెంచి, త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. మంగళవారం ఐడిఓసి సమావేశ మందిరంలో అధికారులతో మేజర్ గ్రామ పంచాయతీల అభివృద్ధి పై కలెక్టర్ సమీక్ష జరిపారు.

అధిక ఆదాయం కల గ్రామ పంచాయతీల్లో చేపట్టిన అభివృద్ధి పనుల్లో వేగం పెంచి, త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. మంగళవారం ఐడిఓసి సమావేశ మందిరంలో అధికారులతో మేజర్ గ్రామ పంచాయతీల అభివృద్ధి పై కలెక్టర్ సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 18న ముఖ్యమంత్రి జిల్లా పర్యటనలో ఇచ్చిన హామీ మేరకు అట్టి నిధులతో ఏమేం పనులు చేపట్టాలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. 10 వేలకు పైగా జనాభా ఉండి, మునిసిపాలిటీలుగా కాని, పెద్దతాండ, ఏడులాపురం, నేలకొండపల్లి, కల్లూరు, కొమ్మినేపల్లి, పాలేరు, తల్లాడ గ్రామాలకు నిధుల విడుదలకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారన్నారు. ముఖ్యమంత్రి హామీ నిధులతో అభివృద్ధి పనులు విభిన్నంగా, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా చేపట్టాలన్నారు. పార్కులు, పారిశుద్ద్యానికి ప్రత్యేక ప్రాజెక్టులు, ట్యాoక్ బండ్, గ్రంథాలయ భవనాలు, దుకాణ సముదాయాలు, పబ్లిక్ టాయిలెట్స్, కమ్యూనిటీ భవనాలు, ఇండోర్ స్టేడియాలు, స్థానిక అవసరాలకు కార్యాచరణ చేయాలన్నారు. నేలకొండపల్లి గ్రామంలో భక్త రామదాసు ధ్యాన మందిరం అభివృద్ధి పనులు, పాలేరు లో పర్యాటక అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఇదివరకే చేపట్టిన పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్షించారు.

ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహాలత మొగిలి, ఇంచార్జి జిల్లా పంచాయతీ అధికారి వి.వి. అప్పారావు, పీఆర్ ఇఇ కెవికె. శ్రీనివాస్, డివిజనల్ పంచాయితీ అధికారి పుల్లారావు, ఎంపిడివో లు, ఎంపీవోలు, సర్పంచులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post