అధైర్య పడవద్దు – అన్ని విధాల ఆదుకుంటాం… జిల్లా కలెక్టర్ కే.శశాంక

ప్రచురణార్థం

అధైర్య పడవద్దు – అన్ని విధాల ఆదుకుంటాం… జిల్లా కలెక్టర్ కే.శశాంక

మహబూబాబాద్, 2021 నవంబర్ 23:

అధైర్య పడవద్దు – అన్ని విధాల ఆదుకుంటామని జిల్లా కలెక్టర్ కే.శశాంక స్పష్టంచేశారు.

మంగళవారం కలెక్టర్ బయ్యారం మండలం గందంపల్లీ గ్రామం పరిధిలోని సింగారం-2 ఎస్సీ కాలనీ సందర్శించి ఇటీవల విద్యుత్తు ప్రమాదంలో మృతి చెందిన తిరుపతమ్మ,, ఉపేందర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.

తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలతో, వారి కుటుంబ సభ్యులతో కలెక్టర్ మాట్లాడుతూ, అధైర్య పడవద్దని ప్రభుత్వం అండగా ఉంటుందని, జిల్లా అధికార యంత్రాంగం తరపున అన్ని విధాల సహకారం అందిస్తామని మీకు మేమున్నాం అని భరోసా ఇచ్చారు. చిన్న వయస్సులో తల్లిదండ్రులను కోల్పోవడం చాలా బాధాకరమన్నారు.

జిల్లా యంత్రాంగం తరపున అన్ని సహకారాలు అందిస్తామని, తల్లిదండ్రులు లేని లోటు కలగకుండా చిన్న పిల్లలకు కుటుంబ పరంగా బాగోగులు చూసుకోవాలని చిన్నారుల పెద్దనాన్న, పెద్దమ్మ లను కోరారు. అందవలసిన నష్టపరిహారాన్ని వెంటనే అందే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

చిన్నారులు శ్యామల, బిందు లను పలకరించారు. మంచిగా చదువుకోవాలని అధైర్య పడవద్దని, ప్రభుత్వం తరుపున ప్రజాప్రతినిధులు, జిల్లా అధికార యంత్రాంగం అంతా ఉన్నారని పిల్లలకు, కుటుంబసభ్యులకు ధైర్యం కల్పించారు.

అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్వైజర్, అధికారులు చిన్నారులకు అండగా ఉండాలని, వారి కుటుంబ పెద్దలను కలుస్తూ సహాయ, సహకారాలు అందే విధంగా పర్యవేక్షించాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో DWO స్వర్ణలత లెనిన, తహశీల్దార్ నాగ భవాని, సూపర్వైజర్ కల్పన, సర్పంచ్ మమత, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.

————————————————————————-
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ చే జారీ చేయ నైనది.

Share This Post