అనధికార ఇంటి స్థలాల సర్వేను పరిశీలించిన జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు అనధికార స్థలాల క్రమబద్ధీకరణకు చేపడుతున్న సర్వేను మంగళవారం జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

ప్రచురణార్ధం

మే 31 ఖమ్మం –

అనధికార ఇంటి స్థలాల సర్వేను పరిశీలించిన జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు అనధికార స్థలాల క్రమబద్ధీకరణకు చేపడుతున్న సర్వేను మంగళవారం జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఖమ్మం నగరం స్థానిక 8వ డివిజన్ లోని వైఎస్సార్ నగర్, 57వ డివిజన్ లోని రమణగుట్ట ప్రాంతంలో పర్యటించి ప్రత్యేక బృందాలతో చేపడుతున్న సర్వే ను ఇంటింటికి వెళ్లి పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 58, 59 లోని ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారంగా సర్వే నిర్వహించాలని, ఇంటి యజమాని అనధికారికంగా నిర్మించిన భవనాలు, కొలతలు సేకరించడంతో పాటు పూర్తి వివరాలను సేకరించి ఆన్ లైన్ యాప్లో పొందుపరచాలని అన్నారు. కలెక్టర్ తన పరిశీలనలో ఎంత కాలం నుండి ఉంటున్నది. ఇంత వరకు ఎందుకు పట్టా రానిది, కరంట్ బిల్లు, ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నది లేనిది స్థానికులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ పర్యటన సందర్భంలో తిరుపతమ్మ, లింగయ్యల కుమార్తె స్వాతి 8వ తరగతి చదివి, చదువు మానేసినదని తెలుసుకొని, వెంటనే తహసీల్దారు. స్వాతిని గురుకులంలో ప్రవేశం ఇప్పించాలని ఆదేశించారు. సైదమ్మ, రాములు కుమార్తె. 18 సంవత్సరాల వికలాంగురాలైన దుర్గమ్మకు రెండు పడకల ఇంటి మంజూరుకు చర్యలు చేపట్టాలన్నారు.

కలెక్టర్ పర్యటన సందర్భంలో అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, ఖమ్మం ఆర్డీవో రవీంద్రనాథ్, ఎడి మైన్స్ సంజయ్ కుమార్, ఎడి సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ రాములు, సిపివో శ్రీనివాస్, తహసీల్దార్ శైలజ సిబ్బంది, తదితరులు ఉన్నారు.

Share This Post