అనాధ పిల్లలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, బాగా చదువుకొని జిల్లా పాలనాధికారి స్థాయి కి ఎదగాలని ప్రభుత్వ సలహా దారులు డాక్టర్ కె. వి రమణ చారి ఉద్భోదించారు

అనాధ పిల్లలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, బాగా చదువుకొని  జిల్లా పాలనాధికారి స్థాయి కి ఎదగాలని ప్రభుత్వ సలహా దారులు డాక్టర్ కె. వి రమణ చారి ఉద్భోదించారు.

గురువారం నారాయణపేట జిల్లాలో   తెలంగాణా ఆవిర్భావ వేడుకలకు ముఖ్య అతిథి గా విచ్చేసిన డాక్టర్ రమణ చారి కార్యక్రమం అనంతరం జిల్లా కేంద్రం లోని వయో వృద్దుల గృహమును జిల్లా కలెక్టర్ తో కలిసి సందర్శించారు.   వృద్దుల గృహం లో ఉన్న ఆనాద విద్యార్ధులతో కరలచాలనం చేసి పిల్లలతో సరదాగా ముచ్చటించారు. ఈ సందర్బంగా ఆయన  మాట్లాడుతూ  అనాధ పిల్లలు మాకు ఎవరూ లేరని దిగులు పడవలసి అవసరం లేదని, రాష్ట్ర ప్రభుత్వం పిల్లల విద్యా, అభ్యున్నతికి అండగా ఉంటుందని భరోసా కల్పించారు.  బాగా చదువుకొని జిల్లా పాలనా అధికారి స్థాయికి ఎదగాలని సూచించారు.  విద్యార్థులకు పండ్లు చాక్లెట్ లు మరియు బిస్కెట్ ప్యాకెట్లను  పంపిణి చేశారు.

ఈ కార్యక్రమం లో జిల్లా యస్పి యాన్ వెంకటేశ్వర్లు, జిల్లా అదనపు కలెక్టర్ చంద్ర రెడ్డి, DWO వేణుగోపాల్,  అశోక్, కుసుమా తదితరులు పాల్గొన్నారు.

Share This Post