పత్రిక ప్రకటన
తేదీ : 11–11–2022
రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి ఎల్లప్పుడూ కృషి చేస్తోంది
అనారోగ్యంతో బాధపడుతున్న జర్నలిస్టుకు రూ.50 వేలు చెక్కు అందచేసిన జిల్లా కలెక్టర్ హరీశ్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటూ వారి సంక్షేమానికి కృషి చేస్తోందని ఈ విషయంలో జర్నలిస్టులందరికీ అవసరమైన పథకాలను అందించేలా తెలంగాణ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేపడుతోందని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు. శుక్రవారం కీసర రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో అనారోగ్యానికి గురైన మల్కాజిగిరికి చెందిన మనం దినపత్రిక జర్నలిస్టు ఈ.జె.చంద్రశేఖర్‌కు జిల్లా కలెక్టర్ హరీశ్ రూ.50 వేల చెక్కును అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… జర్నలిస్టుల సంక్షేమానికి, వారి శ్రేయస్సుకు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు ప్రెస్ అకాడమీ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వాటిని అందరికీ అందేలా చూస్తోందన్నారు. జిల్లాలోని జర్నలిస్టులు తమకేమైనా ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా కలెక్టర్ హరీశ్ తెలిపారు. జర్నలిజం వృత్తిలో ఎన్నో ఇబ్బందులు ఉంటాయని వాటన్నింటినీ ఎదుర్కొంటూ… కుటుంబాలకు సంబంధించి సమస్యలను సైతం ఎదుర్కొంటూ సమాజం కోసం కృషి చేస్తారని అన్నారు. ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్న జర్నలిస్టు ఈ.జె.చంద్రశేఖర్‌కు ఆసుపత్రి అవసరాల నిమిత్తం రూ.50 వేలు చెక్కు అందచేయడం జరిగిందని కలెక్టర్ హరీశ్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టు చంద్రశేఖర్‌కు చెక్కును అందించారు. ఈ కార్యక్రమంలో కీసర ఆర్డీవో రవి,జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి కిరణ్ కుమార్, తదితరులు ఉన్నారు.